Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ వ‌చ్చేసింది.. చాలా ప‌వ‌ర్ ఫుల్‌..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ వ‌చ్చేసింది.. చాలా ప‌వ‌ర్ ఫుల్‌..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఎప్పుడు వ‌స్తుందో ? తెలియ‌క పోయినా ప‌వ‌న్ సినిమాల గురించి ఆస‌క్తి మాత్రం ఎవ్వ‌రికి చావ‌దు. గ‌త రెండేళ్ల‌లో రెండు సినిమాల‌తో ప‌వ‌న్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. వ‌కీల్‌సాబ్‌, భీమ్లానాయ‌క్ రెండు సినిమాలు రీమేక్‌లే అయినా మంచి విజ‌యం సాధించాయి. ఇక ఇప్పుడు ప‌వ‌న్ లైన‌ప్‌లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అయితే ఎప్పుడు ఏ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుందో ? ఏది ప‌ట్టాలు ఎక్కుతుందో తెలియ‌ట్లేదు.

ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా చేస్తున్నాడు. శ్రీ సూర్య మూవీస్ బ్యాన‌ర్‌పై ఏఎం. ర‌త్నం నిర్మిస్తోన్న ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌కుడు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌. బాలీవుడ్ బ్యూటీ జాక్వైల‌న్ ఫెర్నాండెజ్ కీల‌క పాత్ర‌లో రాజ‌కుమారిగా క‌నిపించ‌బోతోంది. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ హిట్ మూవీ వినోద‌యం సితం రీమేక్ చేయాల్సి ఉంది.

ఇక హ‌రీష్ శంక‌ర్ – మైత్రీ మూవీ ఉంది. ఇక దాన‌య్య నిర్మాణంలో సాహో డైరెక్ట‌ర్ సుజీత్ సినిమాకు కూడా ఓకే చెప్పేశాడు. ఇలా వీటిల్లో వీర‌మ‌ల్లు త‌ర్వాత ఏది ముందుగా సెట్స్ మీద‌కు వెళుతుంద‌న్న‌ది మాత్రం అర్థం కావ‌డంలేదు. అయితే ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాన‌య్య బ్యాన‌ర్లో తెర‌కెక్కే సినిమాకు సుజీత్ డైరెక్ట‌ర్‌గా ఫిక్స్ అయిన‌ట్టే. సుజీత్‌కు చిన్న‌ప్ప‌టి నుంచే ప‌వ‌న్‌కు వీరాభిమాని.

అలాంటి సుజీత్ సాహో త‌ర్వాత మూడేళ్లుగా ఖాళీగానే ఉంటున్నాడు. ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్‌కు క‌థ చెప్పి ఓకే చేయించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉన్నా ప‌వ‌న్ ప్ర‌స్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ నేప‌థ్యంలో అస‌లు ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీద‌కు వెళుతుంద‌న్న గ్యారెంటీ అయితే లేదు. ఈ సినిమా క‌థాంశం ముంబై మాఫియా నేప‌థ్యం, గ్యాంగ్‌స్ట‌ర్‌, గ్యాంగ్‌వార్ నేప‌థ్యంలో ఉంటుంద‌ట‌.

సినిమాకు దే కాల్ హిమ్ ఓజీ అన్న క్యాప్ష‌న్ పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఓజీ అంటే ఒరిజిన‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ అని అర్థం అట‌. ఏదేమైనా ప‌వ‌న్ బాలు, పంజా లాంటి సినిమాల్లో మాఫియా నేప‌థ్యంలో న‌టించాడు. మ‌రి ఇప్పుడు సుజీత్ సినిమాలో ఈ సారి ఏ స్టైల్లో క‌నిపిస్తాడో ? అది ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news