Moviesమెగా ఫ్యాన్స్ మరో గుడ్ న్యూస్...పూనకాలు తెప్పించే తీపి కబురు చెప్పిన...

మెగా ఫ్యాన్స్ మరో గుడ్ న్యూస్…పూనకాలు తెప్పించే తీపి కబురు చెప్పిన రామ్ చరణ్..!!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు వరుసగా బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ చెబుతున్నారు . ఈ మధ్యనే ఆయన తండ్రి కాబోతున్నాడు అనే గుడ్ న్యూస్ చెప్పిన రామ్ చరణ్.. రీసెంట్గా తన చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి అంటూ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందించారు. మనకు తెలిసిందే మెగా ఫాన్స్ గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ మెగా వారసుడు. గత పది ఏళ్లుగా ఈ గుడ్ న్యూస్ ఈ జంట చెప్తే చూడాలి అన్నది మెగా ఫాన్స్ కోరిక .

కాగా ఎట్టకేలకు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి . ఈ వార్తతోనే మెగా ఫ్యాన్స్ సంబరపడుతుంటే .. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏకంగా 6 ప్రాజెక్టులకు సైన్ చేశాను అంటూ స్వయంగా వెల్లడించడం సినిమా ఇండస్ట్రీలోని హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సందర్భంగా అమెరికాలో హల్చల్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ టీం.. రీసెంట్గా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టాడు.

2023లో మూడు సినిమాలు 2024లో మరో మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే వచ్చే రెండు సంవత్సరాలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొత్తం హంగామా చేయనున్నట్లు.. మెగా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు 2023 రామ్ చరణ్ కు ఎంతో స్పెషల్ తనకు పుట్టబోయే బిడ్డ ఈ సంవత్సరం లోనే పుట్టబోతున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్ డబుల్ సంబరాలు జరుపుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news