Moviesఎన్టీఆర్, చరణ్ ని కాదని..అతనికే ఓకే చెప్పిన జాన్వీ..అంత మగాడా..?

ఎన్టీఆర్, చరణ్ ని కాదని..అతనికే ఓకే చెప్పిన జాన్వీ..అంత మగాడా..?

సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ పెద్ద కొత్త విషయం కాదు . ఇప్పటికే తరతరాలుగా తాతలు పేర్లు నాన్నల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. మరి కొన్ని నెలల్లోనే మరోతరం జనరేషన్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు ప్రస్తుతం ఉండే స్టార్ హీరోలు . కాగా ఇలాంటి టైం లోనే జాన్వీ కపూర్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా పేరు సంపాదించుకున్న జాన్వి..తనదైన స్టైల్ లో బాలీవుడ్లో హీరోయిన్గా నటిస్తూ మెప్పిస్తుంది .

సోషల్ మీడియాలో ఫుల్ ఎక్స్పోజింగ్ చేసే జాన్వి సినిమాల విషయంలో మాత్రం కంటెంట్ ఉంటేనే సైన్ చేస్తానంటూ భీష్ముంచుకుని కూర్చుంది . కాగా ఇప్పటివరకు బాలీవుడ్ కే పరిమితమైన జాన్వి కపూర్.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే ఆమె దశ తిరిగిపోతుంది అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ 30 సినిమాలో ఆమె హీరోయిన్గా నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . అయితే అందులో ఏమాత్రం నిజం లేదు అంటూ రీసెంట్ గా తేల్చేసాడు బోనీకపూర్ . అంతే కాదు చరణ్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా ట్రై చేస్తున్నట్లు వార్తలు వినిపించినా.. ఇప్పుడు చరణ్ కంటే ముందే మరో హీరోతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు సినీ విశ్లేషకులు .

జాన్వి కపూర్ ఎంతో ఇష్టపడే హీరో విజయ్ దేవరకొండ తో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . మనకు తెలిసిందే ప్రజెట్ శివ నిర్వాణ డైరెక్షన్లో సమంత హీరోయిన్గా తెరకెక్కుతున్న సినిమా ఖుషి . మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది . ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టబోతున్నాడు విజయ్.

ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నాడట విజయ్ దేవరకొండ . అంతే కాదు జాన్వి కూడా విజయ్ తో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది . కాగా మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో తన సినిమాలను లేటుగా స్టార్ట్ చేస్తున్నాడు చరణ్. ఈ క్రమంలోనే చరణ్ తో ఇవ్వాల్సిన టాలీవుడ్ ఎంట్రీని విజయ్ దేవరకొండ తో ఇవ్వడానికి సిద్ధపడుతుంది జాన్వి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో జాన్వీ – కపూర్ విజయ్ దేవరకొండ పేర్లు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. చూడాలి మరి విజయ్ – జాన్వికి ఎలాంటి హిట్ ఇస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news