Moviesత్రిష నమ్మక ద్రోహీ.. తెలుగు స్టార్ హీరోని అంతలా చీట్ చేసిందా..?

త్రిష నమ్మక ద్రోహీ.. తెలుగు స్టార్ హీరోని అంతలా చీట్ చేసిందా..?

ఎస్ ..ఇదే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . అందాల ముద్దుగుమ్మ చెన్నై చంద్రం త్రిష టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ని చీట్ చేసిందా ..? అంటే అవును అని అంటున్నారు జనాలు . మనకు తెలిసిందే తెలుగు సినీ ఇండస్ట్రీలో కి “నీ మనసు నాకు తెలుసు” అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన త్రిష ..మొదటి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది .

ఇక తర్వాత వర్షం సినిమాలో హీరోయిన్గా నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . అప్పటినుంచి త్రిష తన కెరీయర్లో వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ హీరోస్ తో నటించిన త్రిష .. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టం అని.. పలు ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది . అయితే రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష కు పవన్ డైరెక్టర్ హరీష్ శంకర్ అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చినా..ఆమె రిజెక్ట్ చేసిందట.

హరీష్ శంకర్- పవన్ కాంబోలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కి త్రిష ని అప్రోచ్ అవ్వగా ఆమె సున్నితంగా ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట . పవన్ కళ్యాణ్ సినిమా అని తెలిసినా ఆమె రిజెక్ట్ చేయడంపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంటే ఒకప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిందంతా అబద్ధమా..? ఆయంతో స్క్రీన్ చేసుకోవడం లక్కి గా భావిస్తున్నా అని.. ఆయన సినిమాలో అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పుకు వచ్చిన మాటలు క్రేజ్ కోసమేనా..? ఆయన క్రేజ్ ని వాడుకోవాలని చూశావా..? అంటూ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో త్రిష పేరు పలు అంశాల పైన ట్రోల్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన త్రిష మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news