Moviesవీర‌సింహారెడ్డిలో కుర్చీ ఫైట్‌.. కుర్చీ దిగ‌కుండా బాల‌య్య యాక్ష‌న్‌... అరుపులు, కేక‌లే...!

వీర‌సింహారెడ్డిలో కుర్చీ ఫైట్‌.. కుర్చీ దిగ‌కుండా బాల‌య్య యాక్ష‌న్‌… అరుపులు, కేక‌లే…!

న‌ట‌సింహం బాల‌య్య వీర‌సింహారెడ్డి సంక్రాంతి కానుక‌గా ఈ నెల 12న థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. అఖండ లాంటి కెరీర్ బ్లాక్బ‌స్ట‌ర్ త‌ర్వాత బాల‌య్య న‌టించిన సినిమా ఇదే. దీనికి తోడు అఖండ‌తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేలా చేసిన థ‌మ‌నే ఈ వీర‌సింహాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ కావ‌డం.. ఇప్ప‌టికే వ‌చ్చిన మూడు సాంగ్స్‌కు అదిరిపోయే క్రేజ్ రావ‌డంతో.. శృతీహాస‌న్‌తో క‌లిసి బాల‌య్య వేసిన స్టెప్పులు అయితే సినిమాపై స్కై రేంజ్ అంచ‌నాలు పెంచేశాయి.

సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఏ స్టిల్‌, వీడియో కూడా అంచ‌నాలు పెంచేస్తోందే త‌ప్పా… ఎక్క‌డా డిజ‌ప్పాయింట్ చేయ‌లేదు. దీంతో వీర‌సింహారెడ్డి ఖ‌చ్చితంగా బాల‌య్య కెరీర్‌లో మ‌రో సెన్షేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుందంటున్నారు. దీనికి తోడు ఓవ‌ర్సీస్‌లో కూడా భీభ‌త్సంగా ఓపెనింగ్స్ న‌మోదు అవుతున్నాయి. ఈ సినిమాపై ఉన్న అంచ‌నాలు డ‌బుల్ చేసేలా మ‌రో అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

ఈ సినిమాకు ఫైట్ మాస్ట‌ర్లుగా ప‌నిచేసిన రామ్ – ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్ చెప్పిన ఫైట్ గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడే గూస్‌బంప్స్ వ‌చ్చేసేలా ఉన్నాయి. బాల‌య్య కాన్సెఫ్ట్‌కు త‌గిన‌ట్టుగా ఆ ఫైట్ ఉంటుంద‌ని.. చెప్పారు. ఓ సీన్‌లో బాల‌య్య ఛైర్‌లో కూర్చొని ఉంటాడ‌ట‌. ఎదురుగా రౌడీలు వ‌స్తుంటార‌ట‌. అయితే బాల‌య్య క్యారెక్ట‌రైజేష‌న్ ప్ర‌కారం.. ఈ రౌడీల‌ను కూడా నిల్చొని కొట్టాలా ? అని ఆలోచిస్తాడ‌ట‌.

దీంతో బాల‌య్య కుర్చీలో కూర్చొనే రౌడీల భ‌ర‌తం పెట్టేలా ఓ ప‌వ‌ర్ ఫుల్ ఫైట్ డిజైన్ చేశార‌ట‌. అస‌లు ఈ ఫైట్ చూస్తుంటే థియేట‌ర్ల‌లో కంటిన్యూగా విజిల్స్‌, కేక‌లు ఆగ‌వ‌ని.. థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవాల్సిందే అని వారు చెపుతున్నారు. ఏదేమైనా ఇలాంటి యాక్ష‌న్ సీన్ల‌తో వీరసింహారెడ్డి అదిరిపోయేలా ఉంద‌ని టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news