Moviesర‌వితేజ‌కు వ‌రుస‌కు వ‌దిన అవుతోన్న శృతీహాస‌న్‌...!

ర‌వితేజ‌కు వ‌రుస‌కు వ‌దిన అవుతోన్న శృతీహాస‌న్‌…!

శృతీహాస‌న్ వ‌య‌స్సు మూడున్న‌ర ప‌దుల‌కు చేరువ అయిపోయింది. ఇప్పుడు ఆమె ముదురు ముద్దుగుమ్మే. టాలీవుడ్‌లో బాల‌య్య‌, చిరంజీవి లాంటి సీనియ‌ర్ హీరోల‌కు ఆమె మంచి ఆప్ష‌న్‌గా మారింది. అందుకే చిరు వాల్తేరు వీర‌య్య‌, బాల‌య్య వీర‌సింహారెడ్డి రెండు సినిమాల్లోనూ ఆమే హీరోయిన్. టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి ఎవ‌రు గెలిచినా శృతీ గెలిచిన‌ట్టే..! అస‌లు ఇప్పుడు ప్ర‌మోష‌న్ల‌లో కూడా ఎక్క‌డ చూసినా శృతి హంగామాయే క‌నిపిస్తోంది.

ఇక శృతీహాస‌న్ మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కు వ‌దిన‌గా మారుతోంది. అదేంటి శృతి ఏంటి ? ర‌వితేజ‌కు వ‌దిన‌గా మార‌డం ఏంట‌ని షాక్ అవుతున్నారా ? సినిమాల్లో హీరోల పక్కన హీరోయిన్లుగా నటించిన అమ్మాయిలు.. తర్వాత అక్క‌, వ‌దిన పాత్ర‌ల్లోకి మారుతూ ఉంటారు. హీరోయిన్ల స్పాన్ ప‌ది, ప‌దిహేనేళ్ల‌కు మించి ఉండ‌దు. అందుకే ఆ త‌ర్వాత కూడా న‌ట‌న‌లో ఉండాలంటే అక్క‌, వ‌దిన పాత్ర‌లు చేయాలి.

చిరుకు జోడీగా న‌టించిన అన్న‌పూర్ణ త‌ర్వాత ఆయ‌న‌కు త‌ల్లిగా చేసింది. ఇక మోహన్ బాబు సరసన కథానాయికగా నటించిన వెన్నిరాడై తర్వాతి కాలంలో ఆయనకు తల్లిగా చేసింది. ఇక ఇప్పుడు క్రేజీ బ్యూటీ శృతీహాస‌న్ కూడా తాను జోడీగా చేసిన హీరోకే వ‌దిన‌గా న‌టిస్తోంది. ఆ హీరో ఎవ‌రో కాదు మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌. ర‌వితేజ – శృతి కాంబోలో బ‌లుపు, క్రాక్ సినిమాలు వ‌చ్చాయి.

బ‌లుపులో శృతి ర‌వితేజ‌కు గ‌ర్ల్‌ఫ్రెండ్‌గా చేసింది. క్రాక్‌లో భార్య‌గా న‌టించింది. ఇప్పుడు సంక్రాంతికి రాబోతోన్న వాల్తేరు వీర‌య్య‌లో వ‌దిన‌గా క‌నిపించ‌బోతోంది. ఈ సినిమాలో శృతీ చిరుకు జోడీగా క‌నిపిస్తోంది. ర‌వితేజ చిరు స‌వ‌తి సోద‌రుడు. అలా శృతి సినిమాలో ర‌వితేజ‌కు వ‌దిన‌గా క‌నిపించ‌బోతోంద‌ట‌. ఇక వాల్తేరు వీర‌య్య‌తో పాటు పండ‌క్కే వ‌స్తోన్న వీర‌సింహారెడ్డిలోనూ ఆమె హీరోయిన్ కావ‌డంతో సంక్రాంతి క‌ళ అంతా శృతీదే కాబోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news