Moviesసైలెంట్ షాకిచ్చిన స్టార్ డైరెక్టర్.. పెళ్ళి చేసుకోబోతున్న వెంకీ అట్లూరి.. అమ్మాయి...

సైలెంట్ షాకిచ్చిన స్టార్ డైరెక్టర్.. పెళ్ళి చేసుకోబోతున్న వెంకీ అట్లూరి.. అమ్మాయి ఎవ్వరో తెలిస్తే స్టన్ అయిపోతారు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ అందరూ వరుసగా పెళ్లి పీటలు ఎక్కేస్తూ గుడ్ న్యూస్ చెబుతున్నారు . ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ క్-ఓలీవుడ్ లో ఉండే ప్రముఖ స్టార్ సెలబ్రిటీస్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకొని లైఫ్ పార్ట్నర్ తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు . అంతేనా ఆలియా భట్ , ప్రణతి ఏకంగా పిల్లలు కన్నేసి ఆ గుడ్ న్యూస్ కూడా చెప్పేశారు . ఈ క్రమంలోనే మరో టాలీవుడ్ స్టార్ పెళ్లి చేసుకోబోతున్నాడు.

ప్రముఖ నటుడు డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా ఆయన పూజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు . దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . వెంకీ అట్లూరి చాలా సింపుల్ గా తాను ప్రేమించిన పూజా అనే అమ్మాయి తో నిశ్చితార్ధం చేసుకున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి . కొంతమంది ఇండస్ట్రీ సన్నిహితులు వరకే ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తుంది .

కాగా పూజ మరి ఎవరో కాదు ఆయన క్లాస్మేట్ గా తెలుస్తుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న పూజ – వెంకీ అట్లూరి పెద్దలను ఒప్పించి ఈ పెళ్లికి సిద్ధపడినట్లు తెలుస్తుంది . ప్రస్తుతం వెంకి అట్లూరి -పూజ పిక్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో పలువురు ఫాలోవర్స్ స్టార్స్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే అందరూ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ లు చెబుతూ ఉంటే ఇప్పటి వరకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ మాత్రం ఆ గుడ్ న్యూస్ చెప్పలేదంటూ రెబెల్ ఫాన్స్ ఫీల్ అయిపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news