Moviesఅన్ని ఉన్న నాని కి అది మాత్రం లేదు..అందుకే స్టార్ హీరో...

అన్ని ఉన్న నాని కి అది మాత్రం లేదు..అందుకే స్టార్ హీరో కాలేకపోయాడా..?

సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతోమంది యంగ్ స్టార్స్ హీరోగా అవ్వాలని అడుగు పెట్టి ..సక్సెస్ అవ్వలేక వెనకడుగు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరో అవ్వాలనే తమ కల ను నెరవేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి . వాళ్ళల్లో ఒకరే ఈ నాని ..నాచురల్ యాక్టింగ్ తో నేచురల్ స్టార్ అన్న బిరుదుని ట్యాగ్ చేసుకున్న నాని ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు .

అయితే నానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి నాని మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆ తర్వాత హీరోగా అవ్వాలని ఆశతో హీరోగా ట్రై చేసి అష్టా చమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఇక తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలకు సైతం టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. అయితే ఇప్పటికీ నాని సినిమాకి మెగా హీరోలు సినిమాలకు ఇచ్చే థియేటర్స్ కౌంట్ ఇవ్వకపోవడం గమనార్హం.

దానికి మెయిన్ రీజన్ నానికి ఇండస్ట్రీలో సపోర్ట్ లేకపోవడమే . మొదటి నుంచి నానిని ఇండస్ట్రీ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. టాలెంట్ ఉన్నా తొక్కేయడానికే ఎక్కువ ట్రై చేశారు. దానికి మెయిన్ రీజన్ నాని హీరోగా ఎదిగితే పక్కన వాళ్ళు ఇమేజ్ డామేజ్ అవుతుందన్న కారణంతోనే అన్న టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే నాని ఎక్కడ కెరియర్ మొదలు పెట్టాడో అక్కడే ఆగిపోయాడని.. హీరోగానే ఉండిపోయాడు కానీ స్టార్ హీరోగా మారలేకపోయాడని..ఆయన వెనుక బడా ఫ్యామిలీ ఉంటే కచ్చితంగా నాని రేంజ్ మరోలా మారిపోయేదని జనాలు చెప్తున్నారు. అదే నిజం అంటూ నాని ఫ్యాన్స్ చెప్పుకు రావడం సమచలనం గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news