Moviesదిల్ రాజుకు ద‌బిడి దిబిడే... ఇంత లోతున దింపేశారుగా...!

దిల్ రాజుకు ద‌బిడి దిబిడే… ఇంత లోతున దింపేశారుగా…!

టాలీవుడ్‌లో టాప్ మోస్ట్ ప్రొడ్యుస‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఉన్న దిల్ రాజు చుట్టూ అనేక వివాదాలు ముసురుకుంటున్నాయి. ఆయ‌నపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ట్టుగా ఆయ‌న నిజంగానే థియేట‌ర్ల‌ను క‌బ్జా చేసి ఎక్కువ థియేట‌ర్లు త‌న చేతుల‌లో ఉండేలా చేసుకుంటున్నారా ? ఆయ‌న ఆ థియేట‌ర్ల గుత్తాధిప‌త్యంలో ఆ న‌లుగురిలో ఒక‌డిగా నిజంగానే ఉన్నారా ? మ‌రి ఆయ‌న చెప్పిన‌ట్టుగా ఆయ‌న ద‌గ్గ‌ర కేవ‌లం 37 థియేట‌ర్లు మాత్ర‌మే ఉన్నాయా ? మైత్రీ మూవీస్ వాళ్ల‌ను తొక్కే ప‌నిలో వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి సినిమాల‌కు ఆయ‌న నిజంగానే థియేటర్లు ద‌క్క‌కుండా చేస్తున్నారా ? లేదా రాజు వెర్ష‌న్‌లో చూస్తే రాజు ఎదుగుద‌ల చూసి ఓర్వ‌లేని వాళ్లే ఆయ‌న్ను అన‌వ‌స‌రంగా వివాదాల్లోకి లాగుతున్నారా ? అన్న‌ది తెలియ‌దు.

అయితే ఇప్పుడు ఆయ‌న చేసిన కామెంట్లు వైర‌ల్‌గాను, కాంట్ర‌వ‌ర్సీగాను మారాయి. ఓ వైపు తెలుగులో ఆయ‌న చిన్న సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే చిరంజీవి, బాల‌య్య లాంటి పెద్ద హీరోల సినిమాల‌కే థియేట‌ర్లు లేకుండా రాజ‌కీయాలు చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ టైంలో ఆయ‌న నిర్మాత‌గా రూపొందుతోన్న కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ వార‌సుడు సినిమాకు త‌మిళ‌నాడులో థియేట‌ర్ల స‌మ‌స్య వ‌చ్చి ప‌డుతోంది.

ఈ సినిమా అక్క‌డ సంక్రాంతికి భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. జ‌న‌వ‌రి 12న వార‌సుడు తెలుగు, త‌మిళంలో రిలీజ్ అవుతుండ‌గా.. అదే రోజు మ‌రో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ న‌టిస్తోన్న తునివు ( తెలుగులో తెగింపు) కూడా అదే రోజు వ‌స్తోంది. అస‌లు అజిత్‌, విజ‌య్ ఫ్యాన్స్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఈ టైంలో దిల్ రాజు మాట్లాడుతూ అజిత్ క‌న్నా విజ‌యే త‌మిళంలో పెద్ద స్టార్ అని.. అందుకే విజ‌య్ సినిమాకు మ‌రో 50 థియేట‌ర్ల ఎక్కువ ఇవ్వాల‌ని తాను అడుగుతున్న‌ట్టు కోరారు.

రాజు డిమాండ్ ఆయ‌న కోణంలో న్యాయంగానే ఉన్నా త‌మిళంలో అజిత్ ఫ్యాన్స్ రాజును టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు. మామూలుగానే వాళ్ల‌కు విజ‌య్ అంటే గిట్ట‌దు. ఇద్ద‌రు హీరోల‌కు అక్క‌డ డిస్ట్రిబ్యూట‌ర్లు స‌మానంగా థియేట‌ర్లు ఇస్తామంటున్నా రాజు మాత్రం కుద‌ర‌దు.. వార‌సుడికి మ‌రో 50 థియేట‌ర్లు ఎక్కువ ఇవ్వాల‌ని కోరుతున్నారు. అయితే ఇప్పుడు అజిత్ క‌న్నా విజ‌య్ పెద్ద స్టార్ అంటూ మాట్లాడ‌డం అక్క‌డ మంట రాజేసిన‌ట్ల‌య్యింది.

 

విజ‌య్ వార‌సుడు సినిమాను బ్యాన్ చేయాలంటూ అజిత్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. అదే జ‌రిగితే వార‌సుడికి కోలీవుడ్‌లో పెద్ద దెబ్బ ప‌డిపోతుంది. ఇప్ప‌టికే బీస్ట్ ప్లాప్‌తో విజ‌య్ మార్కెట్ డౌన్‌గా ఉంది. అటు అజిత్ సినిమాలు వ‌రుస‌గా హిట్ అవుతున్నాయి. తెలుగులో కూడా ఇప్ప‌టికే రాజు టార్గెట్‌గా పెద్ద ఎత్తున నెగ‌ట‌విటి న‌డుస్తోంది. ఈ టైంలో రాజుకు ఒక‌రిని ఇబ్బంది పెడితే ఎలా ఉంటుందో ఆ బాధ త‌మిళ వాళ్ల ద్వారా తెలిసి వ‌చ్చిన‌ట్ల‌య్యింద‌న్న కామెంట్లు ప‌డుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news