Moviesతెలుగ‌మ్మాయి వేద అన్నీ ఇచ్చినా ఆ కార‌ణంతోనే తొక్కేశారా...!

తెలుగ‌మ్మాయి వేద అన్నీ ఇచ్చినా ఆ కార‌ణంతోనే తొక్కేశారా…!

వేద..అర్చన..ఈరెండు పేర్లతో ఒకే హీరోయిన్ కొంతకాలం ఇండస్ట్రీలో మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అచ్చ తెలుగమ్మాయి అయిన అర్చన హీరోయిన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పాత్రలు పోషించారు. సాధారణంగా హీరోయిన్ అంటే తెలుగమ్మాయిలకి అంత త్వరగా అవకాశం రాదు. వచ్చినా మన ఇండస్ట్రీలో అంత త్వరగా నిలబడలేరు.

దీనికి కారణం కొంతవరకూ పరభాషా నటీమణులేనని చెప్పవచ్చు. ముంబై సహా మలయాళం, కన్నడ హీరోయిన్స్ మన ఇండస్ట్రీకొచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్స్‌గా చెలామణి అవుతున్నది కొన్నేళ్ళ నుంచి మనం చూస్తున్నదే. వారి దెబ్బకే గతకొన్నేళ్ళుగా మన హీరోయిన్స్ అవకాశాలు అందుకోవడంలో వెనకబడిపోతున్నారు. వారు వీరికి పోటీ ఇస్తున్నారంటే అది గ్లామర్ విషయంలోనే.

మన వాళ్ళలో కొందరు గ్లామర్ పాత్రలను పోషించడానికి ఇష్టపడుతున్నా కూడా కొన్ని విషయాలలో మాత్రం ముంబై భామలతో పోటీపడలేకపోతున్నారు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ అంటే మన వాళ్ళు హడలిపోతున్నారు. అదే ముంబై హీరోయిన్స్‌కి పానీపూరి తిన్నంత ఈజీ. అదసలు లెక్కలోకే తీసుకోరు. అందుకే, కొత్త ప్రాజెక్ట్ అనుకోవడం మొదలు పెడితే ముందు ముంబై ఫ్లైటెక్కుతున్నారు మన మేకర్స్.

అయితే, తెలుగులో కూడా కాంప్రమైజ్ అవుతున్న హీరోయిన్స్ ఉన్నారనేది లోలోపల వినిపించే మాట. కమిట్మెంట్స్ విషయంలో ఈ జనరేషన్ హీరోయిన్స్ ఆలోచించడం లేదు. అర్చన కూడా గ్లామర్ పాత్రలు పోషించింది. అల్లరి నరేష్ లాంటి హీరో సరసన లిప్ లాక్ సీన్స్‌లో నటిచింది. లోలోపల చెప్పుకున్నదాన్నిబట్టి కొన్నిసార్లు ఇబ్బందులు పడిందట. అయినా హీరోయిన్ మెటీరియల్ కాదనీ, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న కారణంగా అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news