Moviesమౌనిక రెడ్డి పెళ్ళి చేసుకోబోయే అబ్బాయి అంత తోపా.. మంచి సౌండ్...

మౌనిక రెడ్డి పెళ్ళి చేసుకోబోయే అబ్బాయి అంత తోపా.. మంచి సౌండ్ పార్టీనే పట్టిందిరోయ్..!!

ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీస్ అందరూ ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుంటూ షాక్ ఇస్తున్నారు. కాగా ఇప్పటికీ బాలీవుడ్ – కోలీవుడ్- టాలీవుడ్ స్టార్స్ అందరూ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతూ ఉండగా ..రీసెంట్గా ఆ లిస్టులోకే యాడ్ అయిపోయింది మరో సోషల్ మీడియా సెలబ్రిటీ . ఆమె ఎవరో కాదు పలు వెబ్ సిరీస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న మౌనిక రెడ్డి . ఈ పేరు చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ, ప్రముఖ యూట్యూబఅర్ లవర్ గా చేసిన అమ్మాయి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు .

అంతలా సూర్య అనే వెబ్ సిరీస్ లో తన పాత్రతో జనాలకు దగ్గర అయింది . అంతకు ముందు పలు వెబ్ సిరీస్ లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది కానీ సూర్య వెబ్ సిరీస్ ద్వారనే మౌనిక రెడ్డి ఫేమస్ అయింది . కాగా ఈ సిరీస్తో వచ్చిన పాపులారిటీతోనే వెండితెరపై అవకాశాలు కూడా అందుకుంది . పలు సినిమాల్లో తనదైన స్టైల్ లో చిన్న పాత్రలో నటించి మెప్పించింది .అంతేకాదు భీమ్ల నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించి మెప్పించింది. ఓరి దేవుడో సినిమాలో కూడా చిన్న పాత్రలో మెరిసింది.

కాగా ఎవరు ఊహించిన విధంగా కెరియర్ పిక్స్ లో ఉండగానే మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయింది. తన వెడ్డింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మౌనిక రెడ్డి. తన స్నేహితుడు సందీప్ కూరపాటిని పెళ్లాడబోతుంది ఈ మౌనిక . గత కొంతకాలంగా వీళ్ళు ప్రేమించుకుంటున్నారని అదే విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

డిసెంబర్ 17 ,18 వ తేదీల్లో గోవాలో వీళ్ళ పెళ్లి గ్రాండ్గా జరగబోతున్నట్లు ఇంస్టాగ్రామ్ ద్వారా మౌనిక రెడ్డి అభిమానులకు తెలియజేసింది . దీంతో ఆమె ఫాలోవర్స్ ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు మౌనిక రెడ్డి కాబోయే భర్త సింగర్ అని తెలుస్తుంది .అంతేకాదు సందీప్ బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా పెద్దది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని స్నేహితులు ద్వారా సమాచారం అందుతుంది. కోట్ల ఆస్తికి వారసుడని ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే జంట చూడముచ్చటగా ఉంది అంటూ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి అంటూ ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news