Moviesరిషబ్ తో గొడవ.. మొదటి సారి స్పందించిన రష్మిక.. కన్నడ ఇండస్ట్రీ...

రిషబ్ తో గొడవ.. మొదటి సారి స్పందించిన రష్మిక.. కన్నడ ఇండస్ట్రీ పై సంచలన కామెంట్స్..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ ట్రోలింగ్ కి గురైందో తెలిసిందే. దానికి మెయిన్ రీజన్ కన్నడ స్టార్ డైరెక్టర్ కం హీరో రిషబ్ శెట్టి ..డైరెక్ట్ చేసిన సినిమా కాంతారా ను చూడకపోవడమే అంటూ జనాలు చెప్పుకొచ్చారు . మనకు తెలిసిందే రష్మిక మందన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఆయన డైరెక్షన్ లో వచ్చిన కిరిక్ అనే సినిమాతోనే..ఈ మూవీలో రష్మిక మందన నటించి మెప్పించింది .

అయితే ఆ టైంలో జరిగిన గొడవల కారణంగా రష్మిక-రిషెబ్ దూరంగా ఉన్నారు. కాగా ఎవరు ఊహించని విధంగా కాంతార సినిమా ఆమె చూడకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అంతేకాదు ఆమె మాట తీరు జనాలకి నచ్చలేదని ..ఈ క్రమంలోనే కన్నడ ప్రజలు బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కాగా తాజాగా ఓ షూ స్టోర్ లో మీడియా తో చిట్ చాట్ చేసింది రష్మిక. ఈ క్రమంలోనే ఆమెను రిషబ్ శెట్టి వివాదం పై ప్రశ్నించగా మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది . “నచ్చిన వాళ్ళు నచ్చినట్లు ఏదైనా రాసేసుకుంటారు ..అది అంత నిజం అని నేను అనుకోవట్లేదు. కన్నడ ఇండస్ట్రీ నన్ను బ్యాన్ చేస్తుందని వార్తలు నేను విన్నాను కానీ ఇప్పటివరకు నాకు ఎవరూ ఆ ఇంటిమేషన్ ఇవ్వలేదు.. ఇస్తారని కూడా నేను అనుకోవట్లేదు ..ఎందుకంటే నేనేంటో వాళ్లకి తెలుసు “అంటూ చెప్పకు వచ్చింది .

అంతేకాదు రిషిబ్ తో గొడవ గురించి క్లారిటీ ఇస్తూ “పని లేని జనాలు ఎన్నెన్నో రాస్తూ ఉంటారు.. అవన్నీ నేను పట్టించుకోను ..కాంతార సినిమా నేను చూశాను ..రిలీజ్ అయిన రెండు మూడు రోజుల తర్వాత నన్ను అడిగారు.. ఆ టైంలో నా బిజీ షెడ్యూల్ కారణంగా నేను చూడలేదు ..ఆ తర్వాత నా ఫ్రీ టైం చూసుకుని నేను సినిమా చూశాను ..టీం కి మెసేజ్ చేశాను వాళ్ళ సైడ్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతే ఏదేదో ఊహించుకొనేసి ఏదేదో రాసేస్తే అంత నిజాలు అయిపోవు.

ఇన్నర్ గా ఏం జరుగుతుందో మీకు తెలియదు” అంటూ ఘాటుగానే స్పందించింది. రష్మిక మాటలు మరింత వివాదంగా ముదిరాయి. ఎందుకంటే ఈ కాన్వర్జేషన్లో ఎక్కడ రిసిబ్ శెట్టి అనే పేరు ఆమె తీసుకురాలేదు. అంతేకాదు మొదట్లో రిషిబ్ శెట్టి పేరు చెప్పగానే క్రాస్ ఫింగర్స్ చూపించింది. కానీ ఈసారి కొంచెం తగ్గి కాంతారా టీం అంటుంది . ఈ మాటలు బట్టి చూస్తే నిజంగానే రష్మిక -రిషబ్ వివాదం మరింత తీవ్రస్థాయిలో ముదిరిపోయింది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయకుండా ఉంటేనే మంచిది . జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేయండి పాపం ఇప్పుడిప్పుడే హీరోయిన్గా ఎదుగుతుంది. ఇకపై అలా చేయదు అంటూ ఆమె ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news