Moviesఈ కాంతారా భజన మరీ ఎక్కువైందే..? రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!!

ఈ కాంతారా భజన మరీ ఎక్కువైందే..? రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కాంతారా. ఈ సినిమా రిలీజ్ అయ్యి నెలలకావస్తున్న సరే ఇంకా తెలుగు రాష్ట్రాలల్లో కాంతార హిట్ తగ్గనేలేదు . ఇప్పటికీ అరాకొరా కాంతారా సినిమా గురించి చర్చలు జరుపుతూనే ఉన్నాయి . మరీ ముఖ్యంగా ఈ సినిమాను పొగిడేసే జనాలను రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ -కోలీవుడ్ -శాండల్ వుడ్ అంటూ తేడా లేకుండా చాలామంది ప్రముఖులు కాంతారా సినిమాను డైరెక్టర్ చేసిన రిషిబ్ శెట్టిను ఓ రేంజ్ లో పొగిడేసిన విషయం తెలిసిందే.

కాగా ఎవ్వరు ఊహించని విధంగా 350 కోట్లు వసూలు రాబట్టింది ఈ సినిమా అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం 15 కోట్ల బడ్జెట్ తోనే 350 కోట్లు రాబట్టింది అంటే సినిమాలో ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కన్నడ అభిమానులు సైతం సినిమాను మరింతగా ప్రమోట్ చేస్తున్నారు . ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి కాంతారా పై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరీ ముఖ్యంగా రిషిబ్ శెట్టి కాంతార సినిమాలో దేవుడి గెటప్ లో కనిపించి.. వచ్చే శబ్దం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడుతుంది అంటూ చాలామంది చెప్పుకొచ్చారు. సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే అంటూ కూడా రివ్యూస్ ఇచ్చారు . కాగా ఇదే క్రమంలో రాజమౌళి సైతం అదే మాటను గట్టిగా వినిపించారు. ఒక కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ..” చిన్న చిత్రాలు కూడా భారీ వసూళ్లు సాధిస్తాయని కాంతారా నిరూపించింది.

పెద్ద సినిమాలు హిట్ కొట్టడం నార్మల్ నే.. కానీ చిన్నచిత్రంగా వచ్చిన సినిమా కాంతారా బాక్సాఫీస్ ని షేక్ చేసింది . ఆ సినిమాలో మంచి కంటెంట్ ఉంది “అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే కొందరు జనాలు ఎప్పుడు చూసినా కాంతారా..కాంతారా..కాంతారా ననే.. ఈ కాంతారా భజన మరీ ఎక్కువ అవుతుంది. సినిమా బాగా తీశాడు ..మెచ్చుకున్నారు పదే పదే కాంతారని మెచ్చుకోవాల్సినంత అవసరం ఏముంది ..? మన తెలుగు సినిమాలు బాగా ఉన్నాయి కదా ..? అంటూ అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news