Moviesమెగావారసుడు కి పేరు ఫిక్స్ చేసిన చిరంజీవి..? అదే సెంటి మెంట్...

మెగావారసుడు కి పేరు ఫిక్స్ చేసిన చిరంజీవి..? అదే సెంటి మెంట్ రిపీట్ చేసాడుగా…!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది. మెగా వారసుడు రాబోతున్నాడు ..మెగాస్టార్ కి మనవడు పుట్టబోతున్నాడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కొడుకే పుడతాడు.. మెగా ఇంట సంబరాలు ఇలాంటి వార్తలు ఎక్కువగా వింటున్నాం . దానికి కారణం లేకపోను లేదు. గత పదేళ్ళుగా మెగా అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ నిన్న మెగాస్టార్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అనే స్వీట్ న్యూస్ ని అభిమానులతో పంచుకొని సంబరపడ్డాడు.

ఈ క్రమంలోని సినీ స్టార్స్ అందరూ రాంచరణ్ – ఉపాసనకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు. కాగా ఈ క్రమంలో ఇన్నాళ్లు తల్లి కాలేదు అంటూ ఉపాసనని ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు కంగ్రాచ్యులేషన్స్ మేడమ్ అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాదు మెగా ఫాన్స్ ఉపాసన – రాంచరణ్ ఫొటోలను ట్రెండ్ చేస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఓ హాట్ న్యూస్ వైరల్ గా మారింది . రామ్ చరణ్ కి పుట్టబోయేది కొడుకేనని కచ్చితంగా మెగా వారసుడు తండ్రిని, తాతని మించిపోయే రేంజ్ లో ఉంటాడని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు కొందరు మెగా ఫాన్స్ పుట్టబోయే బాబుకు పేరును కూడా ఫిక్స్ చేసేసారు. మనకు తెలిసిందే మెగా ఫ్యామిలీలో ప్రతి అబ్బాయి పేరు వెనక తేజ్ అని ఉంటుంది . ఈ విధంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తుడు .. అలా తన కోడలు ప్రెగ్నెన్సీ విషయం కూడా హనుమాన్ ఆశీస్సులతో అంటూ షేర్ చేశాడు. ఈ విధంగా చూసుకున్న సరే పుట్టబోయే మనవడికి కచ్చితంగా ఆంజనేయస్వామి పేరు కలిసి వచ్చేలా .. మెగా సెంటిమెంట్ ఫాలో అయ్యేలా అంజన్ తేజ్ అనే పేరుని పెడతాడు అంటూ.. అదే పేరును పెట్టాలి అంటూ మెగా ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అన్న శుభవార్త మెగా ఫ్యామిలీకి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలియదు కానీ ..మెగా ఫాన్స్ అయితే తమ సొంత వదిన ప్రెగ్నెన్సీ దాల్చింది అనంత సంతోషంగా ఆమెకు కేరింగ్ గా ఉండమని సజెషన్స్ ఇస్తున్నారు . చూడాలి మరి పొట్టబోయే వారసుడు ఏ రేంజ్ లో మెగా ఫాన్స్ ను ఆకట్టుకుంటాడో..?

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news