Moviesఅన్నీ ' వీర‌సింహారెడ్డి ' కేనా... మెగా ఫ్యాన్స్ ఆగ్ర‌హం.. అల‌క‌...!

అన్నీ ‘ వీర‌సింహారెడ్డి ‘ కేనా… మెగా ఫ్యాన్స్ ఆగ్ర‌హం.. అల‌క‌…!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్న‌ట్టుగా ఉంది మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌రిస్థితి. ఒకేసారి ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో సినిమాలు నిర్మించ‌డం.. పైగా రెండూ ఒకేసారి సంక్రాంతి బ‌రిలో ఉండ‌డంతో రెండు సినిమాల‌కు సంబంధించి అన్నింటిని స‌మానంగా బ్యాలెన్స్ చేసుకురావ‌డం మైత్రీ వాళ్ల‌కు త‌ల‌ప్రాణం తోక‌కు వ‌చ్చిన‌ట్టుగా మారుతోంది.

బాల‌య్య వీర‌సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీర‌య్య రెండు సినిమాలు సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12, 13 తేదీల్లో రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాల‌కు సంబంధించి స్టిల్స్‌, ఫ‌స్ట్ సింగిల్స్ విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే మైత్రీ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం మైత్రీ వాళ్ల‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

నిన్న హైద‌రాబాద్‌లో మెగాభిమానులు స‌మావేశ‌మ‌య్యారు. మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఈ సమావేశానికి రాగా మెగాభిమానులు వీర‌సింహారెడ్డికి బాగా హైప్ తీసుకువ‌స్తు త‌మ అభిమాన హీరో సినిమాకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

చిరంజీవి సినిమా ప్ర‌చా విష‌యంలో కాన్‌సంట్రేష‌న్ చేయ‌ట్లేద‌ని.. చిరు పాట‌ను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌మంటే చేయ‌కుండా.. బాల‌య్య సినిమా సాంగ్‌ను థియేట‌ర్లో రిలీజ్ చేశార‌ని వారో ఆరోపించార‌ట‌. ఇక మంచి థియేట‌ర్లు అన్ని వార‌సుడు, బాల‌య్య వీర‌సింహారెడ్డికే వెళ్లిపోతున్నాయ‌ని.. చిరంజీవి సినిమాకు మంచి థియేట‌ర్లు కూడా దొర‌క‌డం లేద‌ని కూడా ఆరోపించిన‌ట్టు టాక్ ?

అయితే అభిమానుల‌కు మాత్రం మైత్రీ రవి సమాధానం ఇస్తూ సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని.. ఇంద్ర రేంజ్‌లో ఉంటుంద‌ని.. మంచి థియేట‌ర్లే ఈ సినిమాకు దొరికాయ‌ని వారిని చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు భోగ‌ట్టా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news