Moviesపెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన మ‌లైకా... న్యూ ఇయ‌ర్‌లో గుడ్ న్యూస్...!

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన మ‌లైకా… న్యూ ఇయ‌ర్‌లో గుడ్ న్యూస్…!

బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌తో విడిపోయిన బాలీవుడ్ హాటీ మలైకా అరోరా ఇప్పుడు చేస్తోన్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఆమెకు అర్బాజ్‌తో ఓ కొడుకు.. ఆ కొడుకు వ‌య‌స్సు కూడా 20 ఏళ్లకు ద‌గ్గ‌ర్లో ఉంది. అయినా వ‌య‌స్సులో త‌న‌క‌న్నా 12 ఏళ్ల‌కు పైగా చిన్నోడు అయిన అర్జున్‌క‌పూర్‌తో స‌హ‌జీవ‌నం చేస్తోంది. అస‌లు ప్రేమ‌కు వ‌య‌స్సుతో ప‌నేముంది… పెళ్లితో ప‌నేముంది అని నిరూపించిన సినీ సెల‌బ్రిటీలు వీరిద్ద‌రే.

నాలుగైదేళ్లుగా వీరు ఎంచ‌క్కా హ్యాపీగా స‌హ‌జీవ‌నం చేసుకుంటున్నారు. వీళ్ల‌కు ఏ బాదర బందీ లేదు. అర్జున్ కూడా మలైకా మాయ‌లో ప‌డి పిచ్చోడు అయిపోయాడు. ప్ర‌పంచంలో ఏ మూల‌కు అయినా వీరు వెళ్లిపోతారు. ఎలాగైనా ఎంజాయ్ చేస్తారు. అస‌లు 50 ఏళ్ల‌కు చేరువ అవుతున్నా కూడా మ‌లైకా మాత్రం తాను 20 ఏళ్ల అమ్మాయిలా.. ఇప్పుడు కూడా ఏదో కుర్ర హీరోయిన్‌లా ఫీల్ అవుతూ చిట్టి పొట్టి బ‌ట్ట‌లు, బికినీలు వేసుకుంటూ ర‌చ్చ చేస్తోంది.

అయితే త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌న్న వార్త‌లు గ‌త కొద్ది నెల‌లుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మ‌రో షాకింగ్ ట్విస్టులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మ‌లైకా ప్రెగ్నెంట్ అని టాక్ ? ఇప్ప‌టికే 20 ఏళ్ల కొడుకు ఉన్నా కూడా అర్జున్ క‌పూర్‌తో కూడా ఆమె ఓ బిడ్డ‌ను కనాల‌నే డిసైడ్ అయ్యింద‌ని.. అందుకే మ‌నోడితో స‌హ‌జీవ‌నం చేస్తూనే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యిందంటున్నారు.

ఇక న్యూ ఇయ‌ర్‌లో వీరిద్ద‌రు పెళ్లి చేసుకుని అధికారికంగా భార్య భ‌ర్త‌లు కానున్నార‌ని అంటున్నారు. మ‌లైకా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ షోలో త‌న మ్యారేజ్‌పై కీల‌క‌మైన అప్‌డేట్ ఇచ్చింద‌ని తెలిసింది. సోద‌రి అమృత అరోరాతో జ‌రిపిన చిట్‌చాట్లో మా ఇద్దరిలో మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం వున్న వాళ్లలో మొదటి వ్యక్తిని తానే అని చెప్పింది. ఈ క్ర‌మంలోనే త‌మ అమ్మ త‌మకు పంపిన బ్యాంగిల్స్ పొందే అర్భ‌త కూడా త‌న‌కే ఎక్కువుగా ఉంద‌ని ప‌రోక్షంగా తాను మ‌ళ్లీ పెళ్లికి రెడీ అవుతున్నాన‌న్న క్లారిటీ ఇచ్చేసింది.

మ‌లైకా ఇచ్చిన హింట్‌తో ఇప్పుడు బాలీవుడ్ వ‌ర్గాలు కూడా ఆమె న్యూ ఇయ‌ర్‌లో అర్జున్‌ను పెళ్లి చేసుకోబోతోంద‌ని చెవులు కొరుక్కుంటున్నారు. మ‌రి ఆమె ప్రెగ్నెంట్ అయితే ఇలా ఉండ‌గానే అర్జున్‌ను పెళ్లాడుతుందా ? లేదా ? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news