Moviesఆఫర్ల కోసం నానా తంటాలు..ఆఖరికి ఆ పని కూడా.. లైగర్ బ్యూటీ...

ఆఫర్ల కోసం నానా తంటాలు..ఆఖరికి ఆ పని కూడా.. లైగర్ బ్యూటీ దారుణం..!!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వచ్చాక అదృష్టం వరించిన వరించకపోయినా మన కష్టం మాత్రం ఎప్పుడు తగ్గకూడదు . అలా తగ్గిందా హీరోయిన్గా మనం సెట్ అవ్వము అని మనకు హింట్ వచ్చినట్లే . అయితే అందం అభినయం ఆస్తి టాలెంట్ ఉన్నాకాని కొందరు హీరోయిన్స్ ఎందుకు స్టార్ హీరోయిన్స్ గా మారలేరు ..దానికి మెయిన్ రీజన్ సినిమా చూసింగ్.. తమ స్థాయికి తగ్గ స్టోరీస్ చూస్ చేసుకోకుండా ..రాంగ్ స్టెప్స్ వేస్తూ కెరియర్ ని నాశనం చేసుకుంటూ ఉంటారు కొందరు హీరోయిన్స్ .

ఆ లిస్ట్ లోకి వస్తుంది బాలీవుడ్ స్టార్ డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే. ఆమె బాలీవుడ్ స్టార్ డాటర్ గా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యింది. తనదైన స్టైల్ లో అందంతో అల్లాడిస్తుంది . కాగా చేసిన సినిమాల కన్నా ఫోటోషూట్స్ ఎక్కువ గా తన ఖాతాలో పెట్టుకున్న అనన్య లాస్ట్ గా లైగర్ సినిమాతో జనాలకు కనిపించింది. అయితే ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది.

ఈ క్రమంలోని ఆమె పేరు మరింత డౌన్ ఫాల్ అయింది . కాగా ఆఫర్స్ కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తున్నా సరే అందరూ లైగర్ బ్యూటీ అంటున్నారు తప్పిస్తే అనన్య పాండే అంటూ గుర్తించట్లేదు . ఈ క్రమంలోనే ఆఫర్స్ కోసం అనన్య తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఆమె రెమ్యూనరేషన్ తగ్గించుకున్నా కానీ స్టార్స్ ఎవరూ ఆమెతో నటించడానికి ఇష్టపడట్లేదు . దానికి లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడమే కారణం అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే లైగర్ సినిమా ఒప్పుకునేటప్పుడు అనన్య సినిమా ఫ్లాప్ అయితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఉంటే.. ఇప్పుడు ఆమెకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news