Moviesవామ్మో..రాజమౌళి లో ఆ కోరికలు ఎక్కువా..? అసలు బయటపడడుగా..!!

వామ్మో..రాజమౌళి లో ఆ కోరికలు ఎక్కువా..? అసలు బయటపడడుగా..!!

దర్శక ధీరుడు రాజమౌళి సక్సెస్ ని తన ఇంటిపేరుగా మార్చుకున్న ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటివరకు సినిమా ఇండస్ట్రీ ఒక ఎత్తు.. రాజమౌళి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత ఒక ఎత్తు. అప్పటివరకు డైరెక్టర్స్ అంటే కేవలం డైరెక్షన్స్ మాత్రమే ..ఇండస్ట్రీలో డైరెక్టర్ వెనక ఉండేవాళ్లు పక్కాగా చెప్పాలంటే డైరెక్టర్లకి ఇండస్ట్రీలో వాల్యూనే ఇచ్చేవాళ్ళు కాదు. సినిమా హిట్ అయితే కర్త -కర్మ -క్రియ మొత్తం హీరోలపైనే వేసేసేవాళ్ళు .

అదే ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్షన్ బాగోలేదని నిందలు వేసే వారు. రాజమౌళి ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా అడుగుపెట్టాక చాలా మార్పులు వచ్చాయి . ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ ఎక్కువైపోయారు. గ్రాఫిక్ కల్చర్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు అంతకుముందు సినిమాని ప్రమోట్ చేసుకునే వాళ్ళే కాదు . రాజమౌళి ఇండస్ట్రీలో అడుగుపెట్టాకే ఆయనను చూసి మరో నలుగురు సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు . కాగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రాజమౌళికి ఎక్కువగా క్లీనింగ్ పిచ్చి ఉందట .

అంతే కాదు తన పరిసరాలు మొత్తం నీట్ గా ఉండేలా చూసుకుంటాడట. అంతేకాదు ఇంట్లో కూడా తన పనులు తానే చేసుకుంటూ క్లీనింగ్ కూడా చేస్తాడట. మరీ ముఖ్యంగా ఆయనకు ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టకపోతే కోపం వచ్చేస్తుందట . ఈ విషయంలోనే రమాకు రాజమౌళికు ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో కూడా తారక్ – చరణ్ లు ఇదే విషయం చెప్పుకొచ్చాడు . జక్కన్న తో వేగడం చాలా కష్టమని ..ఒక్క స్టెప్ కోసం మమ్మల్ని టార్చర్ చేశారని ..ఏ విషయంలో నైనా అంతే కఠినంగా ఉంటాడని చెప్పుకొచ్చారు . ఇంత పెద్ద డైరెక్టర్ తన ఇంట్లో తన పనులు తన పనులు తానే చేసుకుంటాడా అంటే అస్సలు నమ్మలేకపోతున్నాం అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా సరే సక్సెస్ ఫుల్ డైరెక్టర్గా మనసు దోచుకున్న రాజమౌళి ఇప్పుడు మంచి మనిషిగా కూడా అభిమానులు సంపాదించుకుంటున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news