Moviesసుకుమార్ లేకపోతే బన్నీ నత్తింగ్గా..? దమిడికి కూడా పనికి రాడా..?

సుకుమార్ లేకపోతే బన్నీ నత్తింగ్గా..? దమిడికి కూడా పనికి రాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ హీరో బన్నీ ..అదేనండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ . డాడీ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన బన్నీ ..ఆ తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా తన సినీ కెరియర్ ని ప్రారంభించాడు . ఆ టైం లో బన్నీ ఫేస్ కి అంత సీన్ లేదు అనే కామెంట్లు ఎక్కువగా వినిపించాయి . మరి ముఖ్యంగా హీరో ఫేస్ కట్ లేదని ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నెట్టుకు రాలేడని జనాలు ట్రోల్ చేశారు .

ఆ టైంలోనే అల్లు అర్జున్ బాగా డల్ అయిపోయాడు. కాగా అదే టైంలో సుకుమార్ ..బన్నీతో ఆర్య సినిమా తీశాడు. దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ పై వచ్చిన నెగటివ్ కామెంట్స్ అన్ని పాజిటివ్గా మారిపోయాయి . కనీ విని ఎరుగని రీతిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి రొమాంటిక్ జిట్ అందుకున్నింది ఆర్య . ఇక తర్వాత ఆర్య 2 కూడా తీసి హిట్టు కొట్టాడు . ఈ క్రమంలోనే సుకుమార్ – అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు.

అంతెందుకు రీసెంట్గా వచ్చిన పాన్ ఇండియా ఫిలిం పుష్ప తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు బన్నీ . త్వరలోనే పుష్ప2 కూడా రిలీజ్ కాబోతోంది . ఈ సినిమాతో ఇండియన్ సినిమా రికార్డును తిరగరాస్తారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ . అయితే సుకుమార్ లేకపోతే బన్నీ ఫేస్ కి ఎంత సీన్ లేదన్న కామెంట్స్ మళ్లీ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా 18 పేజీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ ..సుకుమార్ ని ఓ రేంజ్ లో పొగడమే దీనికి కారణంగా తెలుస్తుంది. నిఖిల్ హీరోగా ..అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా 18 పేజెస్. డిసెంబర్ 23న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనిప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన బన్నీ సుకుమార్ ని పొగిడేస్తూ..”సుకూ లేకపోతే నాకు లైఫ్ లేదు ” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కొందరు కావాలనే బన్నీని వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news