Moviesఓరెయ్..అసలు నీకు బుద్దుందా..? సోనూసూద్ చేసిన పని పై మండిపడుతున్న జనాలు..!!

ఓరెయ్..అసలు నీకు బుద్దుందా..? సోనూసూద్ చేసిన పని పై మండిపడుతున్న జనాలు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . ఇన్నాళ్లు రియల్ హీరోగా కలియుగ దేవుడుగా భావించిన సోనుసూద్ పై కొందరు జనాలు మండిపడుతున్నారు. అది కూడా ఆయన మంచి కోసమే మండిపడుతుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం . మనకు తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు విలన్ రోల్స్ చేస్తూ టాలీవుడ్ లో కూడా విలన్ గా ప్రసిద్ధి చెందిన సోనోసూద్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా టైం లో రియల్ దేవుడిగా మారిపోయాడు. ఎంతో మంది డబ్బున్న స్టార్స్ కూడా ముందడుగు వేసి జనాలకు సహాయం చేయడానికి రాకపోవడంతో.. తానే దేవుడిగా మారి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టాడు.

ఆ విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రధాని నరేంద్ర మోడీ సైతం సోనూసూద్ చేసిన సేవలను కొనియాడారు . అంతేకాదు అన్నిటికన్నా ముఖ్యమైన ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఈ టైం లోనే అందరూ అతన్ని రీల్ విలన్ రియల్ హీరో అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు. అంతేనా ఇకపై తెరపై అతని విలన్ గా చూపిస్తే సహించేది లేదు .. హీరోగా పెట్టి సినిమాలు తీయండి.. బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాం అంటూచెప్పుకొచ్చారు.

ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉండే సోనూసూద్ రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ట్రైన్ లో హాయిగా సీట్లో కూర్చోకుండా ..కదులుతున్న మూవింగ్ ట్రైన్లో సోనోసూద్ ఫుడ్ బోర్డ్ పై రకరకాల విన్యాసాలు చేస్తూ దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా జనాలు షాక్ అయిపోయాడు . తప్పిజారి కాళ్లు స్లిప్ అయినా పొరపాటున హ్యాండ్ జారిన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి భయంకరంగా అనిపిస్తుంది అలాంటి ఓ స్టంట్స్ చేస్తూ సోనోసూద్ కనిపించాడు. ఇలా బుద్ధి లేకుండా ప్రవర్తించడం జనాలకు నచ్చలేదు.

ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు జనాలు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు ఫాన్స్ అయితే దీనిపై మండిపడుతున్నారు. ఇలాంటి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు ..మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న జనాలు ఎంతో మంది ఉన్నారు ..వాళ్ళు ఇలాగే చేస్తారు.. సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news