Moviesయూఎస్‌ఏ ప్రీ సేల్స్‌లో వీరయ్య‌ను మించిన ' వీర‌సింహారెడ్డి ' ......

యూఎస్‌ఏ ప్రీ సేల్స్‌లో వీరయ్య‌ను మించిన ‘ వీర‌సింహారెడ్డి ‘ … లేటెస్ట్ వ‌సూళ్లు ఇవే…!

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్‌ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ? ఈ సినిమాకు ఎలాంటి ప్రి రిలీజ్ బ‌జ్ ఉందో చెప్ప‌క్క‌ర్లేదు. బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్ న‌టిస్తుండ‌గా… మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. చిరు వాల్తేరు వీర‌య్య సినిమాకు పోటీగా ఈ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ‌తో పాటు రెస్టాఫ్ ఇండియాలో అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. అటు ఓవ‌ర్సీస్‌లోనూ అడ్వాన్సులు అదిరిపోయాయి. ఓవ‌రాల్‌గా బాల‌య్య కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన సినిమాగా వీర‌సింహారెడ్డి రికార్డుల‌కు ఎక్కింది. అయితే ఓవ‌ర్సీస్ ప్రి సేల్స్‌లో వీర‌సింహారెడ్డి ఇప్ప‌టికే దుమ్ము రేపుతోన్న‌ట్టుగా తెలుస్తోంది.

ఈ వ‌సూళ్లు ఎలా ? ఉన్నాయంటే చిరంజీవి వాల్తేరు వీర‌య్య వ‌సూళ్ల కంటే ఎక్కువుగానే వ‌స్తున్నాయి. చిరు వీర‌య్య ఇప్ప‌టి వ‌ర‌కు అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం 29 లొకేష‌న్ల నుంచి 62 షోల ద్వారా 20 వేల డాల‌ర్ల వ‌సూళ్లు ఇప్ప‌టి వ‌ర‌కు రాబ‌ట్టుకుంది. అయితే బాల‌య్య వీర‌సింహారెడ్డికి ఇప్ప‌టికే వీర‌య్య ప్రీమియ‌ర్ వ‌సూళ్ల‌కు డ‌బుల్ అడ్వాన్స్‌లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. బాల‌య్య సినిమాకు బ‌ల్క్ బుకింగ్‌లు, బ‌ల్క్ ప్రీమియ‌ర్ల వ‌ల్లే ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్టు ట్రేడ్ టాక్ ?

మామూలుగా ఓవ‌ర్సీస్ జ‌నాల‌ను మాస్ సినిమాలంటే అంత ఆస‌క్తి ఉండ‌దు. అయితే బాల‌య్య అఖండ విష‌యంలో వారి టేస్ట్ పూర్తిగా మారిపోయింది. అఖండ‌ను ఎంత‌లా ఎంజాయ్ చేస్తూ చూశారో తెలిసిందే. అస‌లు అఖండ‌ను ఓవ‌ర్సీస్ జ‌నాలు ప‌దే ప‌దే చూసి ఎంజాయ్ చేశారు. దీంతో అఖండ యూఎస్‌లో బాల‌య్య కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. ఇప్పుడు అదే మానియా వీర‌సింహారెడ్డి విష‌యంలోనూ కంటిన్యూ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news