MoviesNBK108: అనిల్ పిచ్చెక్కించే ప్లాన్..నందమూరి అభిమానులకు మెంటల్ ఎక్కిపోద్ది..!!

NBK108: అనిల్ పిచ్చెక్కించే ప్లాన్..నందమూరి అభిమానులకు మెంటల్ ఎక్కిపోద్ది..!!

వయసుతో సంబంధం లేకుండా.. టాలీవుడ్ యంగ్ హీరోలకు సైతం గట్టి కాంపిటీషన్ ఇస్తూ నందమూరి బాలయ్య సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు . గత ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్న బాలయ్య త్వరలోనే సంక్రాంతి కానుకగా తన తరువాతి సినిమా వీరసింహారెడ్డిని హ్యుజ్ రేంజ్ లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు . గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కిన వీర సిమ్హా రెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు సినిమా మేకర్స్.

ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు , లుక్స్, టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న నందమూరి అభిమానులకు మరో పిచ్చెక్కించే అప్డేట్ ని సిద్ధంగా ఉంచాడు బాలయ్య నెక్స్ట్ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మల్టీ టాలెంటెడ్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో నందమూరి నటసింహం బాలయ్య ఓ సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే . ఇందులో శ్రీ లీల బాలయ్యకు కూతురుగా నటించబోతుంది అంటూ ఎప్పుడో రివీల్ చేసాడు అనిల్. కాగా లెటేస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా లో బాలయ్య కు హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటించబోతుంది అంటూ సమాచారం అందుతుంది .

కాక ఎవరు ఊహించిన విధంగా బాలయ్య ను ఈ సినిమాల్లో కామెడీ రోల్ లో చూపించబోతున్నాడు అనిల్ అంటూ ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఇప్పటివరకు మనం బాలయ్యను సీరియస్ లుక్ లో, పవర్ఫుల్ పాత్రలో చూసాం ఫస్ట్ టైం రొమాంటిక్ లవర్ బాయ్ గా.. చిల్ అవుట్ అవుతున్న యంగ్ మాస్ హీరోగా ఈ సినిమాలో చూడబోతున్నామంటూ తెలుస్తుంది . కాగా అనిల్ రావిపూడి ఆ క్యారెక్టర్ కి తగ్గట్టే సినిమా టైటిల్ ని సైతం నేటితరం యువత ఆకట్టుకునే విధంగా “బ్రో ఐ డోంట్ కేర్” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు టాక్ వైరల్ అవుతుంది .

నిజానికి బాలయ్య ఇప్పటివరకు తీసిన సినిమాల టైటిల్స్ చూస్తే ఇలాంటి టైటిల్ ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైం ఇంత క్యాచీగా.. స్టైలిష్ గా ఉండే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నాడు బాలయ్య . ఏది ఏమైనా సరే ఇలాంటి టైటిల్ తో రొమాంటిక్ లుక్ లో బాలయ్య తెరపై కనిపిస్తే నందమూరి అభిమానులకి మెంటల్ ఎక్కి పోవాల్సిందే . పిచ్చిపిచ్చిగా పిచ్చెక్కిచ్చేస్తారు సినిమా రిలీజ్ అయ్యే లోపే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా సరే ఈ కాలం టాలీవుడ్ హీరోల కన్నా నందమూరి బాలయ్య ఎన్నో రెట్లు బెటర్ అనే విధంగా స్క్రిప్ట్ లను చూస్ చేసుకుంటున్నాడు.
స్టోరీలను చూసి చేసుకుంటున్నాడు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news