MoviesNBK 108 టైటిల్‌పై బిగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది... బాల‌య్య‌కు మ‌రో బ్లాక్...

NBK 108 టైటిల్‌పై బిగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది… బాల‌య్య‌కు మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా..!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో వీర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అఖండ త‌ర్వాత బాల‌య్య న‌టిస్తోన్న సినిమా ఇదే. అటు క్రాక్ లాంటి మాసీవ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత గోపీచంద్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే. దీంతో ఈ సినిమాపై మాస్ జ‌నాల్లోనూ, ఇటు బాల‌య్య అభిమానుల్లోనూ అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి.

బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. కోలీవుడ్ క్రేజీ భామ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజ్ అయిన జై బాల‌య్య సాంగ్ పాపుల‌ర్ అవుతూ యూట్యూబ్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావ‌డంతో బాల‌య్య ఈ నెల చివ‌రి వారం నుంచి త‌న 108వ ప్రాజెక్టులో న‌టించ‌నున్నాడు.

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ సినిమాలో బాల‌య్య కుమార్తెగా యంగ్ హీరోయిన్ శ్రీలీల న‌టిస్తోంది. బాల‌య్య‌కు జోడీగా తెలుగ‌మ్మాయి ప్రియాంక జ‌వాల్క‌ర్‌ను ఫైన‌లైజ్ చేసిన‌ట్టు టాక్ ? ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, పెద్ది చంటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌పై అదిరిపోయే న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

డిసెంబ‌ర్ 8 అంటే రేపు గురువార‌మే ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది. అంటే సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే టైటిల్ ఎనౌన్స్ చేస్తే బ‌జ్ మాత్రం మామూలుగా రాద‌నే చెప్పాలి. బాల‌య్య సినిమాలో 55 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అలాగే బాల‌య్య‌ది సింగిల్ రోల్‌. స్టైలీష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా అనిల్ సినిమా ప్లాన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. టైటిల్ క‌రెక్టుగా బాల‌య్య‌కు సెట్ అయితేనే సినిమా కు ముందే హిట్ క‌ళ వ‌చ్చేయ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news