Moviesఅప్పుడు పూరీ..ఇప్పుడు విజయ్ .. డైరెక్ట్ గా ఫోటో తో గెలికిన...

అప్పుడు పూరీ..ఇప్పుడు విజయ్ .. డైరెక్ట్ గా ఫోటో తో గెలికిన బండ్ల గణేష్..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ నోటి దూకుడు ఎక్కువైంది అన్న కామెంట్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలోనూ బండ్ల గణేష్ మాట్లాడేవాడు కానీ మాటలు అనేటివి హద్దుల్లో ఉండేటివి. అయితే గత కొన్ని నెలల నుంచి బండ్ల గణేష్ ప్రతి కాంట్రవర్షీయల్ మ్యాటర్ లో వేలు పెట్టి తన పేరుని మరింత హైలెట్గా మార్చుకుంటున్నాడు అన్న టాక్ ఎక్కువగా వినిపిస్తుంది . మనకు తెలిసిందే గతంలో పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఎలా ఇండస్ట్రీని షేక్ చేశాయో.

ఇక తర్వాత పూరి జగన్నాథ్ ను టార్గెట్ చేస్తూ తన కొడుకు ఆకాశపూరి సినిమా ఈవెంట్లో డైరెక్ట్ గానే అడగాల్సిన నాలుగు అడిగి కడిగేసి దుమ్ము దులిపేశాడు . కాగా ఆ తర్వాత కూడా పూరి జగన్నాథ్ ని టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ చాలాసార్లు మాట తూలాడు. అయితే ఈసారి మాత్రం డైరెక్ట్ గా విజయ్ దేవరకొండ ను గెలికి బిగ్గెస్ట్ తప్పు చేశాడు బండ్ల గణేష్. రీసెంట్గా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ తన తండ్రికి కటింగ్ చేస్తున్న ఫోటో షేర్ చేస్తూ ..పక్కనే విజయ్ దేవరకొండ వాళ్ళ నాన్నతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ..ఆయన కాళ్లనీ సోఫాపై పెట్టిన ఫోటో రెండిటిని షేర్ చేస్తూ..షాకింగ్ పోస్ట్ చేసాడు.

ఆ ఫోటోలు షేర్ చేస్తూ బండ్ల గణేష్ ..”మనకి ప్రపంచాన్ని చూసే అదృష్టాన్ని కల్పించిన తల్లిదండ్రులను పూజించడం మన ధర్మం “అంటూ రాసుకోచ్చాడు. ఈ పోస్ట్ పరోక్షకంగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేసినట్లు అయింది . దీంతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆయన పై కౌంటర్లు వేస్తున్నారు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం చాలా మంచి విషయమే . కానీ నువ్వు ఇలా విజయ్ దేవరకొండ ఫోటోను పోస్ట్ చేసి ఆయనకు మర్యాద తెలియదు అన్నట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదు . సినిమా ఇండస్ట్రీలో కేవలం విజయ్ దేవరకొండ నే కాదు చాలామంది తండ్రితో ఇలాగే ఫ్రెండ్లీగా ఉంటారు. నీకంటే పనీపాటా లేదు మిగతా వాళ్లకు చాలా పనులు ఉంటాయి అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ కొంచెం హద్దులు మీరి మాట్లాడుతున్నాడు అంటూ సినీ ప్రముఖుల సైతం చర్చించుకుంటూ ఉండడం గమనార్హం..!! డమే పనా..? విజయ్ దేవరకొండను గెలికిన బండ్ల గణేష్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news