Moviesఅయ్య బాబోయ్..షారుఖ్ అక్కడ చెయ్యి పెట్టాడేంటి..పాట పేరుతో పబ్లిక్ గా పచ్చి...

అయ్య బాబోయ్..షారుఖ్ అక్కడ చెయ్యి పెట్టాడేంటి..పాట పేరుతో పబ్లిక్ గా పచ్చి పనులు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం .. సినిమా హిట్ అవ్వడం కోసం స్టార్ సెలబ్రిటీలు సైతం స్టేటస్ ను పక్కనపెట్టి దిగజారిపోయి మరి ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే . కాగా మరోసారి అలాంటి చెత్త పనులతోనే షారుఖ్ ఖాన్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు . మనకు తెలిసిందే బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొనే కలిసి నటిస్తున్న చిత్రం పఠాన్ .

ఈ సినిమాపై బాలీవుడ్ లో హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. సిద్ధార్థ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనులను మొదలుపెట్టేశారు చిత్ర బృందం . ఇందులో భాగంగానే రీసెంట్గా దీపిక పదుకొనే కు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు . ఆ పోస్టర్లో మోనాకిని స్టైల్ లో దీపిక ఎంత హాట్ గా ఉందో అందరం చూసాం.

కాగా గత రెండు రోజులుగా ఈ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న తరుణంలో రీసెంట్గా సినిమా నుంచి “బేచారం” అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాట కొంతమందికే వుపరీతంగా నచ్చేసింది. కుర్రాళ్లు టెంప్ట్ అయ్యేలా దీపికా అందాల ట్రీట్ అందించింది. కుర్రాళ్ళు ఈ వీడియోని పదే పదే చూస్తున్నారు . అదే క్రమంలో ఈ పాటలో షారుక్ ఖాన్ దీపికాతో రెచ్చిపోయి రొమాన్స్ చేయడం కూడా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

 

పాట చివర్లో హాఫ్ బికినీ పై చేయి పెట్టడం.. డ్రెస్ ని పైకి ఎత్తడం అది ప్రైవేట్ పార్ట్ టచ్ అయ్యేలా ఉండటం జనాలకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. దీంతో ఫ్యామిలీతో మీ సినిమా చూడలేం బాబోయ్ అంటూ కొందరు ట్రోల్ చేస్తుంటే ..రన్వీర్ సింగ్ ఇది చూస్తున్నావా అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు . దీపిక టూ మచ్ గా పఠాన్ లో రెచ్చిపోయి నటించింది అన్నది మాత్రం వాస్తవం అని ఈ సాంగ్ చూస్తేనే అర్థమవుతుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news