Moviesషాకింగ్‌: బాల‌య్య - ప‌వ‌న్ అన్‌స్టాప‌బుల్ షో ముందే లీక్ అయిపోయిందే...!

షాకింగ్‌: బాల‌య్య – ప‌వ‌న్ అన్‌స్టాప‌బుల్ షో ముందే లీక్ అయిపోయిందే…!

రీసెంట్‌గా జరిగిన బాల‌య్య – ప‌వ‌న్‌ అన్ స్టాపబుల్ టాక్ షో ఎపిసోడ్ షూటింగ్ కంటిన్యూగా సోష‌ల్ మీడియాలోనూ, మీడియాలోనూ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ లేన‌ట్టుగా ఓ ఓటీటీ ఇంట‌ర్వ్యూ షోకు మీడియా ఇంత పెద్ద క‌వ‌రేజ్ ఇవ్వ‌డం ఇదే ఫ‌స్ట్ టైం. బాల‌య్య – ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌యిక అంత సెన్షేష‌న్‌గా మారింది. పాసులు ఉన్న అతికొద్ది మందికి మాత్ర‌మే సెల్ ఫోన్లు లేకుండా ఈ షో చూసే వెసులుబాటు క‌ల్పించారు. అయితే వాళ్ల నుంచి బ‌య‌ట‌కు లీకులు గ‌ట్టిగానే వ‌చ్చేస్తున్నాయి.

ఈ షోకు వెళ్లిన వారంతా లోప‌ల ఏం జ‌రిగిందో బ‌య‌ట‌కు చెప్ప‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో పెడుతుండ‌డంతో అన్నీ ప్ర‌శ్న‌లు చాలా వ‌ర‌కు బ‌య‌ట‌కు ఏదోలా వ‌చ్చేస్తున్నాయి. ప‌వ‌న్ పెళ్లిళ్ల‌పై అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంతో సంతృప్తి చెందిన బాల‌య్య ఇక‌పై ఆ టాపిక్ ఎత్తుతూ కామెంట్ చేసే వాళ్ల‌ను సున‌కాల‌తో పోల్చార‌ట‌.

అలాగే మ‌ధ్య‌లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో కూడా ఫోన్ కాల్ చేసి స‌ర‌దాగా సంభాషించార‌ట‌. సంక్రాంతికి ముందు మీ నాన్న సినిమా కంటే నా సినిమాయే చూడు అని కూడా చెర్రీతో బాల‌య్య స‌ర‌దాగా అన్నార‌ట‌. ఇక సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా లైవ్‌లోకి వ‌చ్చి బాల‌య్య స్టైల్లో తొడ‌కొట్ట‌డం హైలెట్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు.

ఇక ఈ ఎపిసోడ్‌కే నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ హైలెట్ అంటున్నారు. మోక్ష‌జ్ఞ‌ను ప్ర‌త్యేకంగా పిలిచి ప‌వ‌న్‌తో ఫొటో తీయించిన ఇద్ద‌రి వీడియో అభిమానుల‌కు చాలా స్పెష‌ల్ మూమెంట్‌గా నిలుస్తుంద‌ట‌. ఇక ఇద్ద‌రు టాప్ డైరెక్ట‌ర్లు త్రివిక్ర‌మ్‌, క్రిష్ ఇద్ద‌ద‌రూ వ‌చ్చాక ఇద్ద‌రితో కూడా బాల‌య్య‌కు మాటామంతి బాగా జ‌రిగిందంటున్నారు. అయితే ర‌న్ టైం ఎంత ఉంద‌నేది ఎవ్వ‌రూ చెప్ప‌క‌పోయినా.. ర‌న్ టైం గంట‌పావు వ‌ర‌కు ఉండొచ్చంటున్నారు.

ఇక విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అన్‌స్టాపుబ‌ల్ సీజ‌న్ 2లో ఇదే ఫైన‌ల్ ఎపిసోడ్ అవుతుందంటున్నారు. ఇక చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్ల‌ను మూడో సీజ‌న్లోనే చూచే ఛాన్సులు ఉన్నాయి. సంక్రాంతి కానుక‌గా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news