Moviesరవీనా టాండన్‌ను టాలీవుడ్‌లో కెలికింది ఎవ‌రు... కాంప్ర‌మైజ్ కాలేకే తెలుగు సినిమాలు...

రవీనా టాండన్‌ను టాలీవుడ్‌లో కెలికింది ఎవ‌రు… కాంప్ర‌మైజ్ కాలేకే తెలుగు సినిమాలు వ‌దులుకుందా..!

రవీనా టాండన్ తెలుగు, హిందీ సినిమాలతో మంచి క్రేజీ హీరోయిన్‌గా వెలిగిన సంగతి తెలిసిందే. 1990 దశకంలో ఉన్న స్టార్ హీరోయిన్స్‌లో రవీనా టాండన్‌కి గ్లామర్ క్వీన్‌గా మంచి క్రేజ్ ఉండేది. తెలుగులో నందమూరి బాలకృష్ణ హీఓగా నటించిన బంగారు బుల్లోడు మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వినోద్‌కుమార్‌కు జోడీగా రథసారధి సినిమాలో అవకాశం అందుకుంది.

ఈ సినిమాలో కూడా రవీనా టాండన్ తన అద్భితమైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. అలాగే ఆకాశవీధిలో అనే సినిమా కూడా చేసింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున హీరోగా నటించాడు. రవీనా టాండన్‌కి అప్పట్లో వచ్చిన క్రేజ్‌కి వరుసగా పదుల సంఖ్యలో సినిమాలు చేయాల్సింది. కానీ, తెలుగు ఇండస్ట్రీని వద్దనుకొని హిందీ సీమలో ఎక్కువగా సినిమాలు చేసింది.

ఇప్పటికీ రవీనా టాండన్ ఎక్కువగా బాలీవుడ్ సినిమాలలో నటించడానికే ఆసక్తి చూపిస్తుంది. దీనికి కారణం తెలుగులో తనకు కొన్ని ఘోరమైన అనుభవాలు అనుభవించిందట. ఇక్కడ కొందరు నిర్మాతలు తనని కొన్ని కోణాలలో బాగా ఇబ్బంది పెట్టారట. సినిమా ఇండస్ట్రీ అంటే హీరోయిన్ కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాల్సిందేనని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట.

రవీనా టాండన్ లాంటి గ్లామర్ క్వీన్ ని ఎవరూ వదలాలనుకోరు. వీలైనంతగా వాడేయాలనుకుంటారు. కానీ, అవతలి వారికి తట్టుకునే శక్తి.. సర్దుకునే మనస్తత్వం ఉండాలి. తెరమీద కనిపించినట్టుగా తెర వెనక కూడా ఉంటారనుకుంటే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అదే రవీనా టాండన్ విషయంలో కూడా జ‌రిగిందట. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మోహన్ బాబుతో ఓ సినిమా చేసిన రవీనా… పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ 2లో అద్భుతమైన పాత్ర చేసి ఆకట్టుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news