Moviesఒకే ఒక త‌ప్పు టాలీవుడ్‌ను ఏలాల్సిన య‌మున కెరీర్‌ను త‌ల్ల‌కిందులు చేసేసిందా.....

ఒకే ఒక త‌ప్పు టాలీవుడ్‌ను ఏలాల్సిన య‌మున కెరీర్‌ను త‌ల్ల‌కిందులు చేసేసిందా.. ఆ త‌ప్పు ఇదే..!

ఒక‌ప్పుడు ద‌క్షిణాదిన అందాల‌తో మెప్పించిన హీరోయిన్ల‌లో య‌మున కూడా ఒక‌రు. చూడ్డానికి ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తూ య‌మున చాలా మందికి కల‌ల రాకుమారి అయ్యింది. తెలుగు, త‌మిళ‌,క‌న్న‌డ భాష‌ల్లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించింది. నిజానికి య‌మున ఫ్యామిలీది ఆంధ్ర‌ప్ర‌దేశ్ అయినా క‌ర్నాట‌క‌లో స్థిర‌ప‌డ్డారు. అంతే కాకుండా య‌మున అస‌లు పేరు ప్రేమ‌. అయితే ద‌ర్శ‌కుడు బాల‌చంద‌ర్ ఆమె పేరును సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర‌వాత య‌మున‌గా మార్చారు.

య‌మున మొద‌టి సినిమాను క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్ కు జోడీగా న‌టించింది. ఆ త‌ర‌వాత చాలా క‌న్న‌డ సినిమాల‌లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇక టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే మౌన‌పోరాటం సినిమాతో టాలీవుడ్ లోనూ య‌మున పేరు మారుమోగిపోయింది. ఈ సినిమాలో చ‌క్క‌టి న‌ట‌న మ‌రియు అందంతో అభిమానుల‌ను సంపాదించుకుంది. అంతే కాకుండా ఆ త‌ర‌వాత వినోద్ కుమార్ హీరోగా న‌టించిన మామ‌గారు సినిమాలో న‌టించింది. ఈ సినిమాకు అవార్డులు వ‌చ్చాయి.

ఎవరెవరినో నా భర్త అంటూ పోస్ట్ చేయకండి.. యమున కామెంట్స్ వైరల్ | Actress  Yamuna Interesting Comments About Her Husband Details, Her Husband,  Interesting Comments, Interesting Facts, Yamuna, Serial Actress ...

ఇక ఈ సినిమాలో హీరో చాలా ఎత్తుగా ఉండ‌టం తో య‌మున కాళ్ల కింద స్టూల్స్ వేసి మ్యానేజ్ చేశారు. య‌మున సెంటిమెంట్ ప్ర‌తి ఒక్క‌రిని కంట త‌డి పెట్టించింది. ఆ త‌ర్వాత దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూరిగాడు సినిమాలో కూడా య‌మున పెర్పామెన్స్‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు. ఆ త‌ర‌వాత పుట్టింటి ప‌ట్టుచీర‌, ఎర్ర‌మందారం సినిమాలు య‌మున‌కు టాలీవుడ్ లో మంచి స్టేట‌స్ ను తెచ్చిపెట్టాయి.

Actresses caught in prostitution - IndiaTV News | Bollywood News – India  TV| page 9

కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మయంలోనే పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్ల య‌మున సినిమాల‌కు దూరం అయ్యింది. అయితే కొన్నేళ్ల త‌ర‌వాత రీఎంట్రీ ఇచ్చినా కూడా పెద్ద‌గా ఫ‌లితం లేకుండా పోయింది. కొన్ని సినిమాల‌తోపాటూ సీరియ‌ల్స్ లోనూ న‌టించింది. ఇదిలా ఉంటే య‌మున రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

Telugu News, Telugu Cinema News, Andhra News, Telangana News, Political News

అల్లుడుగారు సినిమాలో ర‌మ్య‌కృష్ణ చేసి పాత్ర కోసం మొద‌ట త‌న‌నే సంప్రదించార‌ని చెప్పింది. కానీ వేరే సినిమాల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఆ సినిమాను రిజెక్ట్ చేసిన‌ట్టు తెలిపింది. ఆ సినిమాలో న‌టించి ఉంటే రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో పెద్ద హీరోలు న‌టించిన సినిమాల‌లో ఆఫ‌ర్ లు వచ్చి ఉండేవ‌ని ఆ త‌ప్పు వ‌ల్లే అవ‌కాశాల‌ను కోల్పోయాయ‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news