Moviesవెరీ ఇంట్రెస్టింగ్: మహేశ్ తరువాత కృష్ణ కు నచ్చిన ఏకైక తెలుగు...

వెరీ ఇంట్రెస్టింగ్: మహేశ్ తరువాత కృష్ణ కు నచ్చిన ఏకైక తెలుగు హీరో ఈయననే.. !!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది స్టార్స్ ఉన్నారు ,,వాళ్లలో జనాలకు ఒక్కొక్కరంటే ఒక్కొక్కరికి ఇష్టం. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ సైతం ఇండస్ట్రీలో ఉండే హీరోస్ ని, వాళ్ల యాక్టింగ్ స్టైల్స్ ని ఇష్టపడుతూ ఉంటారు . అలా టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ హీరో కృష్ణకు టాలీవుడ్ హీరో అంటే పిచ్చిపిచ్చిగా ఇష్టమట. అంతేకాదు ఆయన సినిమా ఏది రిలీజ్ అయిన సరే కచ్చితంగా మిస్ కాకుండా చూస్తారట. మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఎంత మంచి టాలెంటెడ్ హీరో అనే విషయం.

ఎలాంటి రోల్స్ ని అయినా సరే అవలీలగా నటించి జనాలను మెప్పించే సూపర్ స్టార్ కృష్ణ ..సుమారు 350 కి పైగా సినిమాలలో నటించారు . అంతేకాదు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు కూడా హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా.. హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని టాలీవుడ్ టాప్ హీరోలలో వన్ ఆఫ్ ది హీరోగా రాజ్యమేలుతున్నాడు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలో తనకి ఇష్టమైన హీరో ఎవరు అని యాంకర్ అడగ్గా..” మొదటి నాకు నా కొడుకు మహేష్ బాబు అంటే ఇష్టమని, ఆయన కెరియర్ లో వచ్చిన రాజకుమారుడు సినిమా నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పుకొచ్చాడు”.


కాగా ” తన కొడుకు మహేష్ తర్వాత అంతలా తనను ఆకట్టుకున్న నటన ఎవరిది అంటే మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోని నేనెక్కడ చూడలేదని.. ఆయన ఇండస్ట్రీలో ఉన్న హీరోగా సూపర్ సక్సెస్ అవుతాడని మంచి మంచి కథలను చూసి చేసుకోవడం ఎన్టీఆర్ కు బాగా తెలుసని ..నటనలో తాత ని మించిపోయే సత్తా ఉన్నటువంటి హీరో అని చెప్పుకొచ్చారు. అంతేకాదు మీరు ఎన్టీఆర్ తో నటిస్తారా అన్న ప్రశ్నకు ..అవకాశం వస్తే కచ్చితంగా ఎన్టీఆర్ తో గెస్ట్ రోల్ అయినా చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. దీంతో అప్పట్లో ఈ న్యూస్ చాలా వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే కృష్ణ లాంటి స్టార్ ని కోల్పోవడం టాలీవుడ్ చేసుకున్న దురదృష్టమనే చెప్పాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news