Moviesజిన్నా దెబ్బ ... మంచు విష్ణును స‌న్నీలియోన్ అన్ని కోట్ల‌కు నాకించేసిందా...!

జిన్నా దెబ్బ … మంచు విష్ణును స‌న్నీలియోన్ అన్ని కోట్ల‌కు నాకించేసిందా…!

మంచు విష్ణుకు కాలం క‌లిసి రావ‌డం లేదు. గ‌త కొన్నేళ్లుగా చేస్తోన్న సినిమాలు అన్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌రుస‌గా డింకీ కొట్టేస్తున్నాయి. మోస‌గాళ్లు సినిమాను ఏకంగా రు. 50 కోట్ల బ‌డ్జెట్‌తో తీసిన‌ట్టు చెప్పారు. అసలు ఆ సినిమా ఫ‌స్ట్ రోజే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తుస్సుమంది. ఆ త‌ర్వాత మా ఎన్నికల్లో పోటీ చేసిన విష్ణు అధ్య‌క్షుడిగా గెలిచి పెద్ద బాధ్య‌త‌లు తీసుకున్నాడు. అయితే ఈ క్ర‌మంలో విష్ణు చాలా మందికి యాంటీ అయిపోయాడు.

ఇక మా ఎన్నిక‌ల్లో గెలిచాక విష్ణు లాంగ్ గ్యాప్ తీసుకుని తాజాగా జిన్నా సినిమా చేశాడు. అస‌లు ఈ సినిమా టైటిల్‌తోనే పెద్ద కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు సినిమాలో మాజీ పోర్న్ స్టార్ స‌న్నీలియోన్‌, మ‌రో హాట్ భామ పాయ‌ల్ రాజ్‌పుత్ ఇద్ద‌రూ ఉండ‌డంతో సినిమాలో అందాల విందుకు కొద‌వే ఉండ‌ద‌న్న అంచ‌నాలు ముందే వ‌చ్చేశాయి. శ్రీను వైట్ల ద‌గ్గ‌ర ప‌నిచేసిన ఈషాన్ సూర్య ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు.

ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వ‌చ్చినా అనుకున్న స్థాయిలో వ‌సూళ్లు అయితే రాలేదు. ఇక ఈ సినిమాలో ఇద్ద‌రు హాట్ భామ‌లు స‌న్నీలియోన్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ ఉన్నా కూడా సినిమాను ర‌క్షించ‌లేక‌పోయారు. పైగా కామెడీ టైమింగ్ బాగుంద‌ని అంద‌రూ చెప్పినా ప్రేక్ష‌కులు మాత్రం సినిమాను చూసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. పైగా మోహ‌న్‌బాబు ఈ సినిమాకు స్వ‌యంగా స్క్రీన్ ప్లే స‌మ‌కూర్చారు.

ప్ర‌మోష‌న్ల‌లో కూడా స‌న్నీలియోన్ ఉంద‌ని మోహ‌న్‌బాబు చెప్పారు. స‌న్నీలియోన్ వీడియోల‌కు దేశంలో ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. అయినా కూడా ఈ సినిమాలో ఆమె మంచి పాత్ర‌లో చేసినా కూడా తెలుగు జ‌నాలు జిన్నాను ప‌ట్టించుకోలేదు. ఈ సినిమా కోసం స‌న్నీకి నిర్మాత విష్ణు స్వ‌యంగా రు. 2 కోట్లు ఇచ్చాడ‌ట‌. ఈ రెమ్యున‌రేష‌న్‌కు కూడా స‌న్నీ త‌క్క‌వ కాల్షీట్లే ఇవ్వ‌గా… ఆ టైంలోనే ఆమె సీన్లు పూర్తి చేసుకున్నారు.

స‌న్నీకి రు. 2 కోట్ల రెమ్యున‌రేష‌న్‌తో పాటు ఆమెకు ఫైవ్‌స్టార్ హోటల్స్‌, ఫ్లైట్లో క్లాస్ టిక్కెట్లు అన్నీ విష్ణు స్వ‌యంగా బుక్ చేశార‌ట‌. అలా సన్నీ సినిమాను సేవ్ చేస్తుంద‌నుకుని విష్ణు ఆమెకు బాగా ప్ర‌యార్టీ ఇస్తే.. ఆమె మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్‌తో పాటు ఇత‌ర పెసిలిటీస్ తీసుకుని.. విష్ణును బాగా నాకించేసింద‌ని అంటున్నారు. ఇక మ‌రో హీరోయిన్ పాయ‌ల్‌కు రు. 70 ల‌క్ష‌లు ఇచ్చార‌ట‌. హీరోయిన్ల అందాల ఆర‌బోత‌తో అయినా గ‌ట్టెక్కేద్దామ‌నుకున్న జిన్నా మేక‌ర్స్ ఆశ‌లు ప్రేక్ష‌కులు అడియాశ‌లు చేసేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news