Moviesయశోద హిట్ అవ్వడం..సమంత పాలిట మరో శాపమా..? ఏంట్రా బాబు ఈ...

యశోద హిట్ అవ్వడం..సమంత పాలిట మరో శాపమా..? ఏంట్రా బాబు ఈ ట్విస్ట్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా వెవల్ లో నటించిన మూవీ యశోద. ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి ఎలాంటి హ్యూజ్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుందో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా సినిమాలో హీరో లేకుండా హీరోయిన్ ఓరియంటెడ్గా తెరకెక్కిన ఈ మూవీ ఇంత పాజిటివ్ కామెంట్స్ దక్కించుకోవడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . ఎటువంటి రొమాంటిక్ సీన్స్ లేకపోయినా సరే సినిమాను జనాలు ఆదరిస్తూ.. హీరోలే కాదు హీరోయిన్లు కూడా హిట్ సాధించగలరు అంటూ ప్రూవ్ చేసింది సమంత.

అయితే మొదటి రోజు ఫుల్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన యశోద కలెక్షన్స్ రెండో రోజు మాత్రం గ్రాఫ్ డౌన్ అయింది . కాగా ఎలా అయినా బ్రెక్ ఈవెన్ దిశగా యశోద వస్తుంది అంటూ సమంత ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఆ ఆనందం కన్నా సమంత ఇష్టపడిన సినిమా ఆగిపోయింది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ అవుతుంది. మనకు తెలిసిందే సమంత ఇష్టపడి ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన మూవీ శాకుంతలం. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి .

అయితే కొన్ని అనివార్య కారణాల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది . ఈ క్రమంలోనే యశోద సినిమా కంటే ముందే రిలీజ్ అవ్వాల్సిన శాకుంతలం.. యశోద రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేద్దామని మేకర్స్ భావించారట . అయితే అందుతున్న సమాచారం ప్రకారం యశోద సినిమా హిట్ అవ్వడంతో సమంత నటించిన శాకుంతలం సినిమా మరింత వెనక్కి వెళ్ళినట్టు తెలుస్తుంది . ఎందుకంటే సమంత యశోద సినిమాలో లేడీ ఓరియంటెడ్ గా నటించింది ..శాకుంతలం సినిమాలోను అంతే బ్యాక్ టు బ్యాక్ ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు రిలీజ్ అయితే సమంతకు గ్లామరస్ పాత్రలు వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాదు యశోద సినిమాతో కంపేర్ చేస్తే శాకుంతలం సినిమాలో సమంత యాక్షన్ సీన్స్ శూన్యం. ఈ క్రమంలోనే శాకుంతలం సినిమా కలెక్షన్స్ భారీగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి . అందుకే శాకుంతలం సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నారు మేకర్స్ అంటూ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే సినిమా హిట్ అయిన సినిమా పోస్ట్ పోన్ అవ్వడం సమంత బ్యాడ్ లక్ అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news