Moviesపాపం..ఆ మోజే ప్రభాస్ ని ముంచేసిందా..? నా అనుకున్న వాళ్ళే నాకించేసారుగా..!!

పాపం..ఆ మోజే ప్రభాస్ ని ముంచేసిందా..? నా అనుకున్న వాళ్ళే నాకించేసారుగా..!!

తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా అన్నట్లు ..బాలీవుడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకొని టాలీవుడ్ ని వదిలేసి అక్కడికి వెళ్ళిన ప్రభాస్ కు చేదు అనుభవమే ఎదురవుతుంది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. ఇక్కడ సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. తద్వారా బాహుబలి సినిమాలో నటించి ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీని దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ప్రభాస్ ఫిజిక్ పై హాట్ కామెంట్స్ వినిపించడంతో అక్కడికి చెక్కేసిన ప్రభాస్ కి చేదు రిజల్ట్ మిగిలింది .

తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆయన నటనకు మంచి మార్కులు పడేది . కానీ ఏ ముహూర్తాన బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడో కానీ అప్పటినుంచి శని ఆయన నెత్తిన తాండవం చేస్తుంది అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . ఆది పురుష్ సినిమా పై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో మనకు తెలిసిందే. అసలు ఈ సినిమాని ప్రభాస్ ఎలా ఒప్పుకున్నాడు రా అంటూ రెబల్ ఫాన్స్ బాధపడుతున్నారు. దీనికి తగ్గట్టే రీసెంట్గా రిలీ జ్ అయిన హనుమాన్ టీజర్ ఆది పురుష్ కన్నా వెయ్యి రెట్లు బెటర్ అంటూ మిగతా హీరోలు ప్రమోట్ చేస్తుండడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు ఓ రేంజ్ లో ట్రోల్ అవుతుంది.

ఆది పురుష్ గ్రాఫిక్స్ విషయంలో గట్టిగా ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి . కాగా నిన్న టాలీవుడ్ యంగ్ హీరో తేజ నటిస్తున్న హనుమాన్ టీజర్ కూడా రిలీజ్ అయింది . ఈ క్రమంలోని ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది . అసలైన గ్రాఫిక్స్ అంటే ఇది.. సినిమాపై ఇష్టం ఉన్నవాళ్లు ఇలాగే చేస్తారు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఈ రెండు టీజర్ల విషయంలో ఏకాభిప్రాయంతో నెటిజన్లు చెప్పేది ఒకటే ..హనుమాన్ టీజర్ ప్రభాస్ ఆది పురుష్ కన్న 1000 రెట్లు బెటర్.. క్వాలిటీ గ్రాఫిక్స్ తో కంటెంట్తో ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు .

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం హనుమాన్ టీజర్ ని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు . దీంతో కోటి ఆశలతో కోట్ల పారితోషకం అందుకుంటూ బాలీవుడ్ కి చెక్కేసిన ప్రభాస్ ని తోటి హీరోస్ కూడా పరోక్షంగా ట్రోల్ చేయడం సంచలనంగా మారింది . అంతేకాదు ప్రభాస్ కి జాన్ జిగిడి దోస్తులుగా ఉన్న హీరోలు కూడా ఆదిపురుష్ సినిమా పై ట్రోల్ చేసే విధంగా మాట్లాడడం ప్రభాస్ ఫాన్స్ కు హర్టింగ్ గా అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నిజం నా అనుకున్న వాళ్ళ ప్రభాస్ ని పూర్తిగా నాశనం చేసేస్తున్నారు అంటూ రెబెల్ ఫాన్స్ బాధపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news