Moviesఅవకాశాల కోసం ఇంత దిగజారిపోయావా కృతి..? ఆఖరికి ఆయన తో కూడా..!!

అవకాశాల కోసం ఇంత దిగజారిపోయావా కృతి..? ఆఖరికి ఆయన తో కూడా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబమ్మగా పేరు సంపాదించుకున్న కృతి శెట్టి ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఇండస్ట్రీకి రావడం రావడమే మూడు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ..ఆ తర్వాత మూడు సినిమాలను డిజాస్టర్ గా మార్చుకున్నింది. మరీ ముఖ్యంగా ఉప్పెన సినిమాలో కృతి పర్ ఫామెన్స్ చూసి టాలెంటెడ్ విజయ్ సేతుపతి కూడా ఆమెను ఓ రేంజ్ లో పొగిడేశారు. దీంతో ఒక్కసారిగా కెరియర్ గ్రాఫ్ ఎంత హై రేంజ్ కి వెళ్ళిందో.. అదే రేంజ్ లో అమాంతం పడిపోయింది. దీంతో కృతిశెట్టికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి .

స్టార్ హీరోలు కృతి శెట్టికి ఛాన్సెస్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే కృతశెట్టి ఎలాగైనా సరే తన పేరుని పాపులారిటీ చేసుకోవడానికి భిన్న విభిన్నమైన ఫోటోషూట్ చేస్తూ ..చీర అందాలతో తన వయ్యారాలను వలకబోస్తూ కుర్రాలకు అందాల ట్రీట్ ఇస్తుంది . ఈ క్రమంలోనే బేబమ్మ కి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది . రీసెంట్గా ఒకే ఒక్క జీవితం సినిమాతో చాలా కాలం తర్వాత హిట్టు అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి కృతి శెట్టి ఓ సినిమా కి కమిట్ అయినట్లు తెలుస్తుంది.

శర్వానంద్, భలే మంచి రోజు, శమంతకమణి, హీరో ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య కాంబినేషన్‌లో ఓ సినిమాను చేయబోతున్నట్టు తెలస్తోంది. ఫుల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ డిఫరెంట్ రోల్లో కనిపించపోతున్నాడట . కాగా ఈ సినిమాల్లో శర్వానంద్ కి మరదలిగా కృతిశెట్టి నటించబోతున్నట్లు తెలుస్తోంది . ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో లీకై నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి ఈ సినిమా కృతి రేంజ్ కి తగ్గది కాదని అందరికీ తెలిసిందే . కానీ గతిలేక అలాంటి సినిమాకి ఒప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే కృతి కెరియర్ పడిపోతుంది అన్నదానికి ఇదొక నిదర్శనం అంటున్నారు సినీ ప్రముఖులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news