Moviesఇక ఆ బిగ్ సీక్రేట్ దాచలేను..పెళ్ళి పై కియారా ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

ఇక ఆ బిగ్ సీక్రేట్ దాచలేను..పెళ్ళి పై కియారా ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తద్వారా తెలుగులోను పాపులారిటీ సంపాదించుకొని ..ఇక్కడ కూడా సినిమాల లో నటించింది. ” భరత్ అనే నేను” సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..తెలుగులో మొదటి సినిమాతోనే మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసి హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ ను దక్కించుకుంది. ఈ సినిమాలో అమ్మడు పెర్ఫార్మెన్స్ కూడా చాలా క్లాస్ గా కూల్ లుక్ తో ఉండేసరికి కియారా పేరు తెలుగులో కూడా ఓ రేంజ్ లో మారు మ్రోగిపోయింది.

ఈ టైంలోనే “వినయ విధేయ రామ” సినిమాలో రామ్ చరణ్ కు హీరోయిన్ గా ఆఫర్ అందుకుంది . అయితే ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా బిక్ డిజాస్టర్ గా మారింది. ఈ సినిమాలో కియారా అద్వానీను హీరోయిన్ అనడం కన్నా గెస్ట్ రోల్ అంటే చాలా బాగుంటుంది అన్న కామెంట్స్ సినిమా రిలీజ్ అయిన కొత్తలో ఎక్కువుగా వినిపించాయి. కాగా దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైన కియారా మళ్లీ రామ్ చరణ్ సినిమా తోని దగ్గరవుతుంది. ఆర్ సి 15 సినిమాలో చరణ్ కు జోడిగా కియారా నటిస్తుంది.

కాగా బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా పబ్లిక్ లో వీళ్లు ప్రవర్తించిన తీరు చూసి జనాలకు నిజంగానే పెళ్ళి అయిపోయిందా..? ఆ విషయం కియరా దాచుతుందా..? అన్న డౌట్లు కూడా మొదలయ్యాయి. ఇలాంటి క్రమంలోని సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది కియారా.” ఇక నేను ఆ బిగ్ సీక్రెట్ ను దాచలేను.. చెప్పేస్తాను,, డిసెంబర్ రెండవ తేదీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను “అంటూ అఫీషియల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో కియారా అద్వాని సిద్ధార్థ మల్హోత్రాను పెళ్లి చేసుకోబోతుందని.. ఆ ముహూర్తం గురించి జనాలకు అఫీషియల్ గా చెప్పబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . చూడాలి మరి కియారా ఎలాంటి గుడ్ న్యూస్ చెబుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news