Moviesక‌ళ్యాణ్‌రామ్ కొత్త సినిమా ' అమిగోస్ '... ఈ టైటిల్ అర్థం...

క‌ళ్యాణ్‌రామ్ కొత్త సినిమా ‘ అమిగోస్ ‘… ఈ టైటిల్ అర్థం తెలుసా…!

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ రీసెంట్‌ గా ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ప‌టాస్ త‌ర్వాత ఆ రేంజ్ హిట్ బింబిసార‌. ఇంకా చెప్పాలంటే క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే క‌లెక్ష‌న్లు, క‌మ‌ర్షియ‌ల్‌గా బింబిసార పెద్ద హిట్‌. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో క‌ళ్యాణ్ ఇప్పుడు వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మించే కొత్త ప్రాజెక్టులో క‌ళ్యాణ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

కొత్త ద‌ర్శ‌కుడు రాజేంద‌ర్ రెడ్డి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా రివీల్ చేసేశారు. అమిగోస్ అనే టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. క‌ళ్యాణ్‌రామ్ ప‌టాస్ హిట్ త‌ర్వాత చూస్తే 118 లాంటి థ్రిల్ల‌ర్ సినిమాతో పాటు బింబిసార లాంటి హిస్టారిక‌ల్ సినిమా చేశాడు. అంత‌కు ముందు కూడా ఓం, ఇజం లాంటి డిఫ‌రెంట్ సినిమాలు చేశాడు.

ఇక ఇప్పుడు అమిగోస్ అన్న టైటిలే కొత్త‌గా ఉండ‌డంతో సినిమా ఎలా ? ఉంటుందా ? అన్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. టైటిల్ కొత్త‌గా ఉండ‌డంతో నంద‌మూరి, క‌ళ్యాణ్‌రామ్ అభిమానుల్లో మాత్ర‌మే కాదు.. స‌గ‌టు సినీ అభిమానులు అంద‌రిలోనూ క్యూరియాసిటీ నెల‌కొంది. ఇక అమిగోస్ టైటిల్ ఏంటీ కొత్త‌గా ఉంద‌ని ప‌లువురు ఈ ప‌దం అర్థాలు వెతుకుతున్నారు.

ఇక అమిగోస్ అనేది ఓ స్పానిష్ ప‌దం. ఓ ఫ్రెండ్‌ను సూచించేందుకు, లేదా రిఫ‌ర్ చేసేందుకు ఈ ప‌దాన్ని వాడ‌తారు. ఈ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌లో క‌నిపిస్తాడు. ఇక సినిమా షూటింగ్ కూడా చాలా వ‌ర‌కు పూర్త‌యిన‌ట్టే తెలుస్తోంది. ఇక సినిమాకు పెట్టిన క్యాప్ష‌న్ కూడా కొత్త‌గా ఉంది. నీలాగే క‌న‌ప‌డే ఓ వ్య‌క్తి నీకు ఎదురు ప‌డితే నువ్వు చ‌స్తావు అని ఇంగ్లీష్‌లో చెప్పే క్యాప్ష‌న్ పెట్టారు. ఇక సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసేశారు. 2023 ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news