Moviesషోయ‌బ్‌కు సానియా ఆ కార‌ణంతోనే విడాకులిస్తోందా.. వీరి కాపురం కూల్చింది ఎవ‌రు..!

షోయ‌బ్‌కు సానియా ఆ కార‌ణంతోనే విడాకులిస్తోందా.. వీరి కాపురం కూల్చింది ఎవ‌రు..!

ఇద్దరూ హై ప్రొఫైల్ క్రీడాకారులు. ఒకరు క్రికెటర్, మరొకరు టెన్నీస‌ర్‌ స్టార్. పైగా దేశాలు వేరు.. అయితే ఇద్దరు రీజియన్ ఒకటే.. ప్రేమలో పడ్డారు.. పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ అప్పట్లో ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియాలో హైలెట్‌. అయితే అదే ప్రేమ, పెళ్లి ఇప్పుడు పెటాకులు కాబోతుందంటూ వస్తున్న వార్తలు అంతర్జాతీయ మీడియాలో సైతం సంచలనంగా మారాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు మన టెన్నీస‌ర్‌ స్టార్ సానియా మీర్జా. పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్. వీరిద్దరి పెళ్లి ఎంత స్పెషల్ తెలిసిందే.

కొద్దిరోజులుగా సానియా పెడుతున్న పోస్టులు చూస్తుంటే వీరిద్దరూ కలిసి ఉండటం ఆగిపోయి.. విడిగా ఉండటం వరకు వచ్చేసిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవంగా చూస్తే వీరిద్దరి పెళ్లి 2010లో జరిగింది. 2018లో ఈ దంపతులకు ఓ కొడుకు పుట్టాడు. అయితే వీరిద్దరూ కలిసి ఉన్న రోజులు చాలా తక్కువ. సానియా ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటుంది. షోయబ్ ఎక్కువగా పాకిస్తాన్లోనే ఉంటాడు. మరి వీరిద్దరి దాంపత్య జీవితంలో ఎక్కడ పొరాపచ్చలు వచ్చాయో ? కానీ ఇప్పుడు విడిపోయే వరకు వచ్చేసిందని తెలుస్తోంది.

అయితే పాకిస్తాన్ మీడియా, సోషల్ మీడియా మాత్రం గత కొద్దిరోజుల నుంచి వీరిద్దరూ వేరు వేరు దారుల్లో ప్రయాణిస్తున్నారని… త్వరలోనే మీరు విడిపోతున్నారని ప్రచారం చేస్తుంది. అయితే ఈ వార్తలపై ఇటు సానియా కానీ.. అటు మాలికి కానీ స్పందించడం లేదు. సానియా రీసెంటుగా రెండు పోస్టులు పెట్టింది. ప‌గిలిపోయిన గుండెలు ఆ దేవుడిని వెత‌క‌డానికి ఎక్క‌డికి వెళ్లాల‌న్న‌ట్టుగా ఒక‌ పోస్టు ఉంది. ఇక ఓ ప్ర‌ముఖ మోడ‌ల్‌తో షోయ‌బ్ సంబంధాలు, ఇటీవ‌ల ఓ ఫొటో షూట్ నేప‌థ్యంలో వారిద్ద‌రు స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డం సానియా మ‌న‌స్సును గాయ‌ప‌రిచింద‌ని టాక్ ?

అయితే షోయ‌బ్‌కు అనుకూలంగా ఉండాల్సిన పాకిస్తానీ మీడియా కూడా షోయ‌బ్‌నే త‌ప్పు ప‌డుతోంది. షోయ‌బే సానియాను మోస‌గించాడ‌ని క‌థ‌నాలు వేస్తోంది. అలాగే సానియా రీసెంటుగా పెట్టిన పోస్టులో క‌ష్టంగా ఉన్న రోజుల్లో ఓ క్ష‌ణం అన్న‌ట్టుగా ఉందా పోస్టు. రీసెంటుగా సానియా, షోయ‌బ్ కుమారుడు ఇజాన్ నాలుగో బ‌ర్త్ డే వేడుక‌లు సెల‌బ్రేట్ చేసుకున్నారు. షోయ‌బ్ ఆ ఫొటోలు త‌న ఇన్‌స్టాలో కూడా షేర్ చేసుకున్నాడు.

పాకిస్తాన్‌లో రీసెంట్‌గా పాపుల‌ర్ క్రికెట్ ప్రోగ్రామ్‌లో సానియాకు సంబంధించిన టెన్నీస్ అకాడ‌మీలు ఎక్క‌డెక్కడ ఉన్నాయ‌ని ప్ర‌శ్నించారు. ఆ ప్ర‌శ్న‌కు షోయ‌బ్ త‌న‌కేం తెలియ‌ద‌ని చెప్పాడు. అయితే ఈ ఆన్స‌ర్‌కు షాక్ అయిన వ‌కార్ యూన‌స్ అస‌లు నువ్వు ఎలాంటి భ‌ర్త‌వు అని ప్ర‌శ్నించాడు. అయితే ఇప్పుడు ఈ బ్రేక‌ప్ విష‌యం పాకిస్తాన్ మీడియాను ఓ కుదుపు కుదుపుతోంది. మ‌రి ఈ బంధం బ్రేక‌ప్ వార్త‌ల‌కు ఇద్ద‌రు క్లారిటీ ఇచ్చే వ‌ర‌కు ఇవి ఆగవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news