Moviesఆ ఒక్క పని చేస్తే .. ఆంటీ అనసూయ మళ్ళీ డార్లింగ్...

ఆ ఒక్క పని చేస్తే .. ఆంటీ అనసూయ మళ్ళీ డార్లింగ్ అవుతుందా..?

ఎవరి టైం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేం. స్టార్ గా ఉన్న హీరోస్ జీరో అవ్వడం.. జీరో గా ఉన్న హీరో స్టార్ గా మారడం .. సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ గా నడుస్తుంది. అన్నిటికి ఒకటే సమాధానం ఓర్పుగా ఉండాలి . మనల్ని బూతులు తిడుతున్న ఓర్పుగా ఉండాలా అంటే కాదు. కానీ మనం ఆ బూతు పదాలు మాట్లాడకుండా ఉండాలి .. అదే చరిత్ర చెబుతున్న పాఠం. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒక పొజిషన్లోకి వచ్చాక ఏం మాట్లాడినా సరే ఆచి తుచి ఆలోచించుకొని మాట్లాడాలి . పొరపాటున ఒక మాట నోరు జారితే ఆ మాటను వెనక్కి తీసుకోలేం అని పేదవాళ్లు అంటూ ఉంటారు .

అలాగే స్టార్ సెలబ్రెటీలు సైతం తెలిసి చేసిన తెలియక చేసిన తప్పుకి ఆ పాపం అనుభవించాల్సింది వాళ్లే . ప్రజెంట్ అదే పొజిషన్లో ఉంది గ్రేట్ యాంకర్ అనసూయ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే బుల్లితెరపై యాంకర్ గా దుమ్ము దులిపేసిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై కూడా తన సత్తా చాటింది. రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా అనసూయ చేసిన పర్ఫామెన్స్ నటించిన నటన ఇప్పటికే జనాలు మర్చిపోలేక పోతున్నారు . అంతేకాదు స్టార్ హీరోయిన్ ని మించిపోయే ఫిజిక్ ఉన్న అనసూయ .. హాట్ ఐటెం సాంగ్స్ లో నటించింది . మంచి పాత్రలోనూ హాట్ రోల్స్ లోను నటించి మెప్పించిన అనసూయ యాంకర్ గాను తన కెరియర్ను ముందుకు తీసుకెళ్తున్న టైం లో ఎవరు ఊహించని విధంగా లైగర్ సినిమాపై పరోక్షకంగా కామెంట్ చేసింది .

దీంతో అక్కడి నుంచి అమ్మడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అప్పటినుంచి అనసూయ ప్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి ఎక్కువగా గురవుతుంది. అంతకుముందు అనసూయ ట్రోలింగ్ కి గురయ్యేది . కానీ ఆ ట్వీట్ పెట్టిన తర్వాతే అనసూయ ను ఆంటీ అంటూ ఎక్కువగా ట్రోల్ చేశారు . అంతకుముందు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకున్న ఫాన్స్ సైతం అనసూయ ఆంటీ అంటూ దీర్ఘం తీస్తున్నారు . అంతేనా అనసూయ ఆ ట్రోలర్స్ ని వార్న్ చేసి వదిలేసి ఉంటే అక్కడితో మేటర్ క్లోజ్ అయ్యేది.

కానీ వాళ్ళందరికీ రివర్స్ కౌంటర్లో ఆమె బూతు పదాలు మాట్లాడటంతో ఈ గొడవ చిలికి చిలికి గాలి వాన లా మారింది. ఇప్పుడు ట్రోల్ చేసిన ట్రోలర్స్ హ్యాపీగానే ఉన్నారు . ట్రోలింగ్ కి గురైన అనసూయనే అవకాశాల లేక అల్లాడుతుంది . అనసూయ మళ్లీ తన పేరుకు ముందు డార్లింగ్ గా జనాల చేత పిలిపించుకోవాలంటే కచ్చితంగా విజయ్ దేవరకొండను పొగడాల్సిందే ..అలా చేస్తే ఫాన్స్ కొంచెం శాంతిస్తారు ..అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సినీ సినీ ప్రముఖులు . చూద్దాం మరి అనసూయ తగ్గి నెగ్గుతుందో ..ఎక్కి తగ్గుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news