Moviesఆ సినిమా హిట్ అయితే నువ్వు హీరో గా ఫ్లాప్ అయ్యిన్నట్లే.....

ఆ సినిమా హిట్ అయితే నువ్వు హీరో గా ఫ్లాప్ అయ్యిన్నట్లే.. కృష్ణ కు నచ్చని మహేశ్ మూవీ ఇదే..!!

టాలీవుడ్ సినీ పరిశ్రమ మూగబోయింది. టాలీవుడ్ స్టార్ సీనియర్ సూపర్ స్టార్ హీరో కృష్ణ.. ఈ తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు కన్నుమూశారు. మహేష్ బాబు అమ్మగారు మరణించిన విషా ఛాయలు మరువకముందే ఘట్టమనేని ఫ్యామిలీలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో తీవ్ర విషాదంలోకి నింపేసింది. టాలీవుడ్ ప్రముఖులు. సీనియర్.. జూనియర్ ,రాజకీయ నేతలు సూపర్ స్టార్ కృష్ణ మృతిపై ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు .

కాగా, ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ పాత వీడియోలు , పాత ఇంటర్వ్యూలు ట్రెండ్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ . ఈ క్రమంలోని సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకు మహేష్ బాబు కెరియర్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి . గతంలో ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ఓ రేంజ్ లో పొగిడేసారు .

రాజకుమారుడు సినిమా తో ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన మహేష్ బాబు ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి.. తెలుగు ఇండస్ట్రీకి అందించారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..మహేష్ బాబు కెరియర్ లో నాని సినిమా ఆయనకి నచ్చదని ఓపెన్ గానే చెప్పేశారు. ” ఒక స్టార్ హీరో చేయాల్సిన ప్రయోగాత్మక సినిమా అది కాదని.. ఒకవేళ నిజంగా ఆ సినిమా హిట్ అయి ఉంటే మహేష్ బాబు హీరోగా ఓడిపోయి ఉండేవాడని “అని చెప్పుకొచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మహేష్ బాబు పక్కనే ఉన్నాడు. ఆయన కూడా “ఈ నాని సినిమా నాకు గుణపాఠం అని ..ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నానని” చెప్పుకొచ్చారు . ఏది ఏమైనా సరే కృష్ణ మరణం మహేశ్ బాబుకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news