Moviesపెళ్లి చేసుకోవడానికి విక్కి కి కత్రీనా పెట్టిన ఏకైక కండీషన్ ఇదే.....

పెళ్లి చేసుకోవడానికి విక్కి కి కత్రీనా పెట్టిన ఏకైక కండీషన్ ఇదే.. ఏ మగాడు యాక్సెప్ట్ చేయకూడనిది..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రీసెంట్ గానే తన ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ..మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది . ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్ధాలు అవుతున్నా అవకాశాలు సంపాదించుకుంటున్న కత్రినా .. ఇప్పటికీ స్టార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ..మంచి మంచి సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ .. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండీ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ అటు వెండి తెరపై ఇటు సోషల్ మీడియాలో రెండింటిలోనూ టాప్ మోస్ట్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది.

కాగా తనకంటే చిన్నవాడైన విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్.. వీళ్ల డేటింగ్ టైం లో నే విక్కీ కౌశల్ కు కొన్ని కండిషన్స్ పెట్టిందట . మరీ ముఖ్యంగా పెళ్లి చేసుకోవడానికి ఆమె పెట్టిన కండిషన్స్ తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే. అలాంటి ఓ క్రేజీ కండిషన్ పెట్టి విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకున్నింది కత్రినా. ఇంతకు కత్రినా ..కౌశల్ కి పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ..?

పెళ్లి తర్వాత ఎవరైనా సరే ..ఇద్దరు కలిసి ఉంటూ కష్టసుఖాలలోను పాలుపంచుకుంటూ ..లైఫ్ లో ముందుకు తీసుకెళ్లాలి. అది సంతోషం అవ్వనివ్వండి..బాధ అవ్వనివ్వండి.. భార్య భర్తలు ఇద్దరు కలిసే బ్రతకాలి . అయితే కత్రినా మాత్రం పెళ్లి తర్వాత ..నీ డబ్బు నీది, నా డబ్బు నాది ..అన్న ఒక కండిషన్ పెట్టిందట . నీకు ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది.. “ఎందుకు డబ్బులు వాడుతున్నావు అని నేను అడగను ..నువ్వు నా పారితోషకం జోలికి రాకూడదు..

ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే ఇద్దరం షేర్ వేసుకుని కోనుకుందాం ..అంతే తప్పిస్తే నేను ఖర్చు చేస్తున్నందుకు నువ్వు అరవకూడదు..నువ్వు నా మీద పెత్తనం చెలాయించకూడదు ..నా డబ్బులు ఏమైనా చేసుకుంటాను టూర్లకు వెళ్తాను.. మేకప్ కిట్స్ కొనుక్కుంటాను.. అలాగే నేను నువ్వు తాగిన.. ఫ్రెండ్స్ కి ఖర్చు చేసినా అడగను.. ఏదైనా సరే ఫ్యామిలీకి పెట్టాలి అనుకున్న టైంలో ఇద్దరం షేర్ చేసుకొని పెట్టుకుందాం.. ప్రస్తుతం ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news