Moviesఇష్టపడి పడుకుంటే తప్పేంటి..? .. కాస్టింగ్ కౌచ్‌పై బాంబు పేల్చిన బిగ్‌బాస్...

ఇష్టపడి పడుకుంటే తప్పేంటి..? .. కాస్టింగ్ కౌచ్‌పై బాంబు పేల్చిన బిగ్‌బాస్ దివి..!

తెలుగు బిగ్ బాస్ ద్వారా ప‌రిచ‌య‌మైన‌ చాలామంది సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ఆ లిస్టులో దివి కూడా ఒకరు. అప్పటికే మహేష్ బాబు సినిమాలో ఓ పాట‌లో క‌నిపించిన‌ దివి బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ పొడ‌వాటి సుందరి ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. హౌస్ లో ఎలాంటి కాంట్ర‌ర్సిలు లేకుండా అభిమానుల‌ను సంపాదించుకుంది. అంతే కాకుండా ఫైన‌ల్స్ కు గెస్ట్ గా వ‌చ్చి మెగాస్టార్ చిరంజీవి దివిని చూసి ఫ్లాట్ అయ్యాడు.

దాంతో తన సినిమాలో అవకాశం ఇస్తానని దివికి మాటిచ్చారు. చిరు మాట‌తోనే ఆమ త‌బ్బిఉబ్బైపోయింది. మాటిచ్చిన విధంగానే చిరంజీవి తన సినిమాలో అవకాశం కూడా ఇచ్చారు. దివికి గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి అవకాశం కల్పించారు. ఈ సినిమాతో స్టార్ హీరో సినిమాలో మంచి రోల్ లో నటించే అవకాశాన్ని దివి దక్కించుకుంది. ఇక దివి ప్రస్తుతం టీవీ షో లతోపాటు సినిమాలు వెబ్ సిరీస్ ల‌తో ఫుల్ బిజీగా ఉంటోంది.

ఇటు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో దివి మ‌తులు పోగొడుతోంది. హీరోయిన్ల‌ను మించిన హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో సోష‌ల్ మీడియాలో దివి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో దివి కాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకూ ఇండస్ట్రీలో మీరు కాస్టింగ్ కౌచ్ ను ఎదురుకున్నారా..? అంటూ యాంకర్ ప్రశ్నించగా దివి మాట్లాడుతూ మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్ లో తను నటించాన‌ని ఇప్పటివరకు తనకు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎద‌రుకాలేద‌ని చెప్పింది.

మన ప్రవర్తన‌ను బట్టి ఇతరులు ప్రవర్తిస్తారు…. నేను నాతో అలా ప్రవర్తించే ఛాన్స్ ఎప్పుడూ ఇవ్వలేదు అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఒక అబ్బాయి అమ్మాయి కమిట్ అవ్వడంలో తప్పులేదు… వాళ్ళు ఇష్టపడి కమిట్ అవుతున్నారు. నాకు తెలిసి ఇప్పుడు ఇండస్ట్రీలో అలానే కమిట్ అవుతున్నారు. అంటూ దివి బాంబు పేల్చింది. దివి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news