Moviesహాట్ టాపిక్ గా మారిన గలాట గీతూ రెమ్యూనరేషన్..ఏ కంటెస్టెంట్ కి...

హాట్ టాపిక్ గా మారిన గలాట గీతూ రెమ్యూనరేషన్..ఏ కంటెస్టెంట్ కి ఇవ్వని స్పెషల్ ఆఫర్..!?

భారీ అంచనాల నడుమ స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎనిమిదవ వారం హౌస్ నుంచి ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ లో గలాటా గీతూ ఎలిమినేట్ అంటూ నాగార్జున చెప్పుకు రావడం అందరి గుండెలను ముక్కలు చేసింది . ఎవరు ఊహించని విధంగా గీతు ఎలిమినేట్ అవ్వడం ఇప్పటికి జనాలకు షాకింగ్ గా ఉంది. నిజానికి బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి హౌస్ లో గేమ్ ఆడిన ఏకైక కంటెస్టెంట్ ఎవరూ అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు గలాటా గీతూ.

తనదైన స్టైల్ లో ఆట ఆడుతూ నవ్విస్తూ ..అలరిస్తూ ..తన గేమ్ స్ట్రాటజీలతో ఎలా అయినా విన్ అవ్వాలి అంటూ గేమ్ ఆడిన గీతు నిన్న రాత్రి ఎనిమినేట్ అయింది. బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో ఒకరుగా నిలుస్తుంది అనుకున్న గలాటా గీతూ ఇలా ఎనిమిదో వారమే ఎవరు ఊహించిన విధంగా హౌస్ నుండి బయటకు వచ్చేయడం షాకింగ్ గా అనిపించింది. అంతే కాదు గత రెండు వారాల నుంచి హౌస్ లో ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తుందని.. తన గేమ్ కన్నా ఇతరుల గేమ్ చెడగొట్టే పనిలోనే భాగం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూస్తుందని జనాలు చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు ఓవర్ యాక్టింగ్ మాటలు వినలేకపోతున్నాం అంటూ చాలామంది జనాలు ఆమెపై ఫైర్ అయ్యారు . ఈ క్రమంలోనే ఆమెకు ఓట్లు తక్కువగా వేసి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేలా చేశారు .అయితే నాగార్జున ఎలిమినేట్ అని చెప్పగానే స్టేజి పైకి వచ్చిన గీతు కన్నీరు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నేను ఎక్కడికి పోను సార్.. నేను ఇక్కడే ఉంటాను.. నన్ను పంపించకండి అంటూ ఏడ్చిన దృశ్యాలు ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారాయి. కాగా గీతు 8 వారాలకు గాను దాదాపు 4 లక్షలు వెనకేసుకున్నట్లు తెలుస్తుంది వారానికి 50,000 చొప్పున ఆమె ఈ అమౌంట్ అందుకున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వార మళ్ళీ గీతూని హౌస్ లోకి పంపించాలని చేస్తున్నారని బిగ్ బాస్ టీం నుండి ఒక క్రేజీ మ్యాటర్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news