Moviesదేశాన్ని ఊపేసిన ఆ క్రేజీ హీరో బాల‌య్య‌కు విల‌న్‌గానా... అదిరిపోయే ట్విస్ట్...

దేశాన్ని ఊపేసిన ఆ క్రేజీ హీరో బాల‌య్య‌కు విల‌న్‌గానా… అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారుగా…!

న‌ట‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో వీర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 108వ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. ఈ సినిమాకు రామారావు గారు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో బాల‌య్య‌కు కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీలీల న‌టిస్తోంది. బాల‌య్య 50 ఏళ్ల పై వ‌య‌స్సు ఉన్న మ‌ధ్య వ‌య‌స్సు వ్య‌క్తిగా క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా ప్రియ‌మ‌ణి పేరు వినిపిస్తోంది. గ‌తంలో ప్రియ‌మ‌ణి బాల‌య్య ప‌క్క‌న మిత్రుడు సినిమాలో న‌టించింది. ఇక ఈ సినిమాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ రోల్ కూడా ఉంది.

ఈ కీలక పాత్ర‌కు 20 ఏళ్ల క్రితం బాలీవుడ్‌ను మోస్ట్ హ్యాండ్‌స‌మ్ హీరోగా అల‌రించిన సీనియ‌ర్ హీరో బాబీడియోల్‌ను తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. స‌న్నీడియోల్ సోద‌రుడు అయిన బాబీడియోల్ 2000వ ద‌శ‌కంలో బాలీవుడ్‌లో టాప్ మోస్ట్ హీరో. బాబీ అందం అంటే అప్ప‌టి అమ్మాయిలు ప‌డి చ‌చ్చేవాళ్లు. అనిల్ రావిపూడి ఇప్ప‌టికే బాబీడియోల్‌తో ఈ పాత్ర గురించి చ‌ర్చ‌లు జ‌రిపార‌ని కూడా తెలుస్తోంది.

అనిల్ రావిపూడి ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువుగా కామెడీ టైమింగ్ పంచ్‌లతో సినిమాలు తీసి సూప‌ర్ హిట్లు కొట్టాడు. ఇప్పుడు బాల‌య్య సినిమాను మాత్రం అందుకు భిన్నంగా తెర‌కెక్కిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఆరు వ‌రుస హిట్ల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న అనిల్ రావిపూడి, బాల‌య్య కాంబినేష‌న్ అంటేనే ప్రేక్ష‌కుల్లో ఎక్క‌డా లేని ఎగ్జైట్మెంట్ వ‌చ్చేసింది. షైన్‌స్క్రీన్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి నిర్మిస్తోన్న ఈ సినిమా స్క్రిఫ్ట్ వ‌ర్క్ ఇప్ప‌టికే కంప్లీట్ అయ్యింది. త్వ‌ర‌లోనే షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news