Moviesవావ్: సిరికి బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. గేమ్ ను పీక్స్...

వావ్: సిరికి బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. గేమ్ ను పీక్స్ కు తీసుకెళిన శ్రీహాన్ లవర్..!!

తెలుగులోని అతి పెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ప్రజెంట్ సీజన్ సిక్స్ సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తుంది. కాగా గతంతో కంపేర్ చేస్తే సీజన్ 6 ప్రోగ్రాం కు ఎక్కువ టిఆర్పి రావట్లేదు. దానికి మెయిన్ రీజన్ షోలో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ లేకపోవడం ..ఉన్న కంటెస్టెంట్స్ కూడా కంటెంట్ మీద కాకుండా పక్కనున్న అమ్మాయిలు మీద ఫోకస్ చేస్తుండడంతో షో చెత్త టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంది . కాగా ఈ మధ్యనే హౌస్ నుంచి టాప్ కంటెస్టెంట్ గీతూ ఎలిమినేట్ అవ్వడం మరో బిగ్ డిజాస్టర్ గా మారింది .

అయితే ఈ కారణంగా బిగ్ బాస్ 6 సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోల్ అవుతూనే ఉంది . టీఆర్పీలు పెంచుకోవడానికి బిగ్ బాస్ చేసిన మరో ప్లాన్ ని ఏకిపారేస్తున్నారు జనాలు. మనకు తెలిసిందే బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్స్ బాగుపడ్డారు ..అలాగే బిగ్ బాస్ పేరు చెప్పుకొని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. సీజన్ ఫైవ్ లో బిగ్ బాస్ పేరు చెప్పుకొని పరువు పోగొట్టుకుంది ఎవరయ్యా అంటే కళ్ళు మూసుకొని చెప్పే పేర్లు యూట్యూబర్స్ షణ్ముఖ్-సిరి.

స్నేహం పేరుతో వీళ్లిద్దరు హౌస్ లో చేసిన నానా రచ్చ అందరికీ తెలిసిందే. అంతెందుకు హౌస్లో యవ్వారం చూసిన షణ్ముఖ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన ఏకంగా బ్రేకప్ చెప్పేసి బై బై చెప్పెసింది. అంతలా రచ్చ రచ్చ చేశారు. తాజాగా కంటెస్టెంట్స్ తో విత్ స్టార్ పరివారం అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు . ఈ ప్రోగ్రాం లో బిగ్ బాస్ కంటెస్టెంట్ సీజన్ ఫోర్ అండ్ సీసన్ పైవ్ కి మధ్య పోటీ పెట్టారు. కాగా ఈ మూమెంట్లోనే బిగ్ బాస్ ..”సిరి ఎలా ఉన్నారు ..బిగ్ బాస్ తర్వాత మీ జీవితం ఎలా ఉంది ..హౌస్ లో ఉన్న మీ హార్ట్ శ్రీహానికి ఏం చెప్పాలనుకుంటున్నారు..” అంటూ సడన్ షాక్ ఇచ్చారు . దీనితో ఒక్కసారి ఎమోషనల్ అయినా సిరి కన్నీరు పెట్టేసుకుంటుంది .

అయితే సిరి కి ఇది బిగ్ బాస్ ఇచ్చిన మరో ఆఫర్ అంటున్నారు జనాలు. షన్ను గురించి అస్సలు నిజం బయటపెట్టి మేము ఫ్రెండ్స్ అంటూ మరోసారి బల్లగుద్ది చెబితే శ్రీహాన్ కి పాజిటివ్ కామెంట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటున్నారు . అంతేకాదు టాప్ ఫైవ్ లిస్టులో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news