Moviesదర్శకుడి ప్రేమలో నాగార్జున హీరోయిన్ పూనమ్ బజ్వా ..!

దర్శకుడి ప్రేమలో నాగార్జున హీరోయిన్ పూనమ్ బజ్వా ..!

పూనమ్ బజ్వా నాగార్జున తో బాస్ సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముంబై లో పుట్టిన పంజాబీ అమ్మాయి పూనమ్, 2005 లో మిస్ పూణేగా సెలెక్ట్ అయ్యింది. ఆలా ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు మాడలింగ్ లో ప్రవేశించింది. 12th గ్రేడ్ చేదువుతున్న సమయంలో పూనమ్ హైదరాబాద్‌కి రాంప్ వాక్ కోసం రాగా, అదే సమయంలో ఆమెను చుసిన దర్శకుడు కూచిపూడి వెంకట్ సినిమాల్లో నటిస్తావా ? అని అడిగాడు. అప్పటికే కాలేజీ మొదలవవడానికి 4 నెలల సమయం ఉండటం తో నటించడానికి ఒప్పుకుంది. అలా ఆమె కూచిపూడి వెంకట్ డైరెక్షన్ లో మొదటి సినిమా అనే చిత్రంలో నటించింది.

ఈ చిత్రంలో నవదీప్ సరసన హీరోయిన్‌గా నటించిన పూనమ్, ఆ తర్వాత సినిమాలు కొనసాగిస్తూనే ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ కూడా పూర్తి చేసింది. మొదటి సినిమాలో నవదీప్, పూనమ్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవ్వడంతో రెండవ సినిమాగా అతడితోనే ప్రేమంటే ఇంతే సినిమాలో నటించింది. ఆ తరువాత నాగార్జున బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన పూనమ్ కెరీర్ మొత్తం మీద ముప్పై సినిమాల వరకు నటించింది. తెలుగుతో పాటు, కన్నడ, మలయాళ మరియు తమిళ సినిమాల్లో కూడా కొన్ని మంచి చిత్రాల్లో నటించింది.

కెరీర్ మొదట్లో పెద్ద హీరోలతో నటించకపోవడం, పెద్ద హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించడం, కథలను సరిగ్గా ఎంచుకోకపోవడంతో పూనమ్ స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. అల్లు అర్జున్, నాగార్జున, జీవా వంటి పెద్ద హీరోల సినిమల్లో నటించిన పూనమ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడానికి చాలానే ట్రై చేస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తెగ వయ్యారాలు పోతూన్న పూనమ్ 35 ఏళ్ళ వయసులో కూడా సింగిల్ గానే ఉంది.

లాక్ డౌన్ సమయంలో ఈమె ఎక్కువగా తెలుగు డైరెక్టర్ తో ప్రేమలో పడింది అనే వార్తలు వచ్చాయి. ఎక్కడ చుసిన వీరి ఫోటోలు హల్చల్ చేసాయి. దాంతో మీడియాలో వీరి బంధంపై అనేక వార్తలు రాగా పూనమ్ వీరిపై స్పందించింది. తాను దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డితో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని హింట్ కూడా ఇచ్చింది. ఇక దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెలుగులో గత 20 ఏళ్ళుగా దాదాపు 25 చిన్న సినిమాలను డైరెక్ట్ చేయడం విశేషం.

సునీల్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాతగా మారి సినిమాలు తీసాడు. సైలెంట్ ప్లీస్ అనే సినిమాను మొదట దర్శకత్వం వహించిన సునీల్ 2021 లో చివరగా హనీ ట్రాప్ అనే సినిమాను తీసాడు. సునీల్ డైరెక్ట్ చేసిన సినిమాలో సొంత వూరు, మిస్ లీలావతి, నేనేం చిన్న పిల్లనా ? , ఒక క్రిమినల్ ప్రేమ కథ వంటి కొన్ని నటబుల్ సినిమాలు ఉన్నాయ్. ఇక సునీల్ రెడ్డి మరియు పూనమ్ కలిసి దిగిన అనేక ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న‌ పూనమ్ త్వరలో అతడినే పెళ్లి చేసుకోబోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news