Moviesఆ స్టార్ హీరో ప‌విత్రా లోకేష్‌ను వాడుకుని వ‌దిలేశాడా...? ఎవ‌రా హీరో..?

ఆ స్టార్ హీరో ప‌విత్రా లోకేష్‌ను వాడుకుని వ‌దిలేశాడా…? ఎవ‌రా హీరో..?

పవిత్ర లోకేష్ ఒకప్పుడు ఈ పేరు పెద్దగా వార్తల్లో వేపించేది కాదు.. కానీ కొద్ది రోజులుగా ఈ న‌టి పేరు నాన్ స్టాప్ గా వార్తల్లోకి ఎక్కుతోంది. దానికి కారణం లేటు వయసులో పవిత్ర లోకేష్ సీనియ‌ర్‌ నటుడు నరేష్ తో డేటింగ్ లో ఉండటమే. కన్నడ ఇండస్ట్రీకి చెందిన పవిత్ర లోకేష్ బాలన‌టిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పవిత్ర లోకేష్ తండ్రి కూడా నటుడే అవ్వడంతో సినిమాల్లోకి తండ్రి ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ పవిత్ర లోకేష్ పలు చిత్రాలు చేసింది. హీరోయిన్‌గా ఆమె పెద్దగా సక్సెస్ అవ్వలేదు.

దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పవిత్ర లోకేష్ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలోనూ పవిత్ర లోకేష్ సక్సెస్ అయ్యారు. హీరోలకు తల్లి, అత్త లాంటి పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. తెలుగులో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో శర్వాకు తల్లిగా నటించి తన నటనతో మెప్పించారు. ఇక వరుస సినిమాల్లో నటిస్తున్న సమయంలో పవిత్ర లోకేష్ నటుడు నరేష్ ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు గుప్పుమనాయి.

అంతేకాకుండా టాలీవుడ్ లో పవిత్ర లోకేష్ కు నరేష్ అవకాశాలు ఇప్పిస్తున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. ఇద్దరు కలిసి ఓ స్వామీజీ వద్దకు వెళ్ళిన ఫోటోలు నెట్టింట‌ చక్కర్లు కొట్టాయి. మరోవైపు పవిత్ర లోకేష్ – నరేష్ లను నరేష్ మూడో భార్య బెంగ‌ళూరులోని హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మీడియా ముందు నిలబెట్టారు. దాంతో వీరి వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక రీసెంట్ గా నరేష్ పవిత్ర లోకేష్ కలిసి ఓ సినిమాలో నటించగా ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఇద్దరు కలిసి ఓ వీడియోను విడుదల చేశారు. దాంతో నరేష్ – పవిత్ర బంధం విడదీయరానిదని అందరికీ అర్థం అయింది.

ఇదిలా ఉంటే పవిత్రా లోకేష్ గతంలో కన్నడ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవిత్రా లోకేష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. ఇప్పుడు పరవాలేదు కానీ ఒకప్పుడు నాకు అవకాశాలు ఇచ్చేవాళ్లను చూస్తుంటే భయం వేసేద‌ని అన్నారు. ఆఫర్ ఇచ్చినందుకు తననుండి ఏం కోరుకుంటున్నారోన‌ని టెన్షన్ పడేదాన్ని అని తెలిపారు. అంతేకాకుండా గతంలో తనను ఓ స్టార్ హీరో వాడుకుని వదిలేసాడని పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చారు. కానీ ఆ హీరో ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news