Moviesసింగ‌ర్ గీతామాధురి... హాట్ యాంక‌ర్ ర‌ష్మీ సోష‌ల్ మీడియా వార్‌... దుమ్మెత్తి...

సింగ‌ర్ గీతామాధురి… హాట్ యాంక‌ర్ ర‌ష్మీ సోష‌ల్ మీడియా వార్‌… దుమ్మెత్తి పోసుకున్నారుగా..!

ప్రముఖ సింగర్ గీతామాధురి , హాట్ యాంక‌ర్ జ‌బ‌ర్ద‌స్త్ ర‌ష్మీ మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా మాట‌ల తూటాలు పేలుతున్నాయి. అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణం ఏంటి ? ఏం జ‌రిగిందో చూద్దాం. గీతా మాధురి భ‌ర్త నందు, ర‌ష్మి క‌లిసి జంట‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ అనే సినిమా తెర‌కెక్కింది. అయితే రెండేళ్ల నుంచి కోవిడ్ కార‌ణంగా రిలీజ్ ప‌లుమార్లు వాయిదా ప‌డింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్ర‌చారం చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ టైంలో నందూ, అత‌డి భార్య గీతామాధురి, ఇటు ర‌ష్మి కాంట్ర‌వ‌ర్సీ పోస్టులు పెట్టుకున్నారు. నందు అయితే ర‌ష్మీ మా ఫోన్లు ఎత్త‌డం లేదు.. ఇప్ప‌టికే 32 సార్లు ఫోన్లు చేశామ‌ని మండిప‌డ్డాడు. అలాగే నందు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు వెళ్లి ర‌ష్మిపై తీవ్ర ఆరోప‌ణ‌లు కూడా చేసి బాంబు పేల్చాడు.

 

ర‌ష్మీ మా ఫోన్లు ఎత్త‌డం లేదు.. బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు రావ‌డం లేదు.. ఆమె నా ప‌క్క‌నే ఉన్న బిల్డింగ్‌లో ఫొటో స్టూడియోలో షూట్ చేస్తుంద‌ని కూడా చెప్పాడు. వెంట‌నే ర‌ష్మి ఉన్న స్టూడియోలోకి వెళ్లి ఆమెను చూసిన వెంట‌నే నా ఫోన్ ఎందుకు ఎత్త‌డం లేదు.. ప్ర‌మోష‌న్ల‌కు ఎందుకు రావ‌డం లేద‌ని అడిగాడు. వెంట‌నే రెండేళ్ల క్రితం వ‌దిలేసిన సినిమా ప్ర‌మోష‌న్ల‌కు తాను ఇప్పుడు రాను.. అయినా ఈ సినిమాలో క‌థ‌, స్క్రీన్ ప్లే లేక‌పోతే చాలా విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని అని చెప్పింది.

వెంట‌నే నందు ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి.. నువ్వు ప్ర‌మోష‌న్ల‌కు రావాల‌ని గ‌ట్టిగా నిల‌దీస్తాడు. చివ‌ర‌కు ముందు తిర‌స్క‌రించినా.. త‌ర్వాత ఆమె ప్ర‌మోష‌న్ల‌కు ఒప్పుకుంటుంది. అస‌లు ఈ గొడ‌వ అంతా ఏంటంటే ఇది నందు ఆడిన డ్రామా. వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తోన్న బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ప్ర‌మోష‌న్ ప‌బ్లిసిటీ స్టంట్ కోసం ఇలా క్రియేట్ చేశారు. మ‌రి ఈ ప‌బ్లిసిటీ స్టంట్ సినిమాకు ఎంత వ‌ర‌కు క‌లిసి వ‌స్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news