Moviesషాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్..?

షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్..?

భారీ అంచనాల మధ్య మొదలైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ 6 ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే బిగ్ బాస్ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ నడుమ తెలుగులో ప్రారంభమైన బిగ్ బాస్ 6 రోజు రోజుకి రసంతరంగా సాగుతుంది. కాగా ఈ వారం నామినేషన్ లో కీర్తి-సుదీప-శ్రీ బాలాదిత్య-రాజ్-శ్రీ సత్య-మెరీనా-ఆదిరెడ్డి-గీతూ నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే .

కాగా వీరిలో ఖచ్చితంగా ఈ ఆదివారం ఒకరు బిగ్ బాస్ హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోయేది సుదీప అన్నట్లు తెలుస్తుంది. ఉన్న అందరి కంటెస్టెంట్లలో అందరికన్నా హైయెస్ట్ ఓటింగ్ శ్రీహాన్ కి వచ్చినట్లు ..ఆ తర్వాత ఆదిరెడ్డి, కీర్తికి వచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు అందరికన్నా లోయెస్ట్ ఓటింగ్ లో రాజ్ ,సుదీప, కీర్తి .మెరీనాలో ఉన్నట్లు తెలుస్తుంది.

వీళ్ళందర్లో కంపేర్ చేస్తే సుదీప కొంచెం హౌస్ లో తక్కువగా మింగిల్ అవుతున్నట్లు ..ఆమె టాస్కల పరంగా కూడా పెద్దగా కాన్సెంట్రేషన్ చేయలేకపోతున్నట్లు జనాలు చెప్పుకొస్తున్నారు . ఈ కారణంగానే సుదీప ఎలిమినేట్ అవ్వబోతుందని తెలుస్తుంది . ఈమె ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన జనాలు కు.. సుదీప్ ఎలిమినేట్ అవ్వబోతుంది అన్న వార్తలు కాస్త నిరాశ కలిగిస్తున్నాయి . మరి చూడాలి బిగ్ బాస్ ఏం చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news