Moviesటాలీవుడ్‌లో హీరోయిన్లంటే సిగ్గుప‌డుతూ ట‌చ్ కూడా చేయ‌ని హీరోలు వీళ్లే.. ?

టాలీవుడ్‌లో హీరోయిన్లంటే సిగ్గుప‌డుతూ ట‌చ్ కూడా చేయ‌ని హీరోలు వీళ్లే.. ?

సాధారణంగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు మధ్య బాగా సాన్నిహిత్యం ఉంటుంది. కలిసి నటించడంతో వాళ్ల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీనటుల మధ్య పరిచయాలు ప్రేమగా మారి పెళ్లి వరకు కూడా వెళ్లాయి. ఇక మరికొందరు హీరోలు, హీరోయిన్లు మాత్రం కేవలం సినిమాల వరకే నటీనటులతో క్లోజ్ గా ఉంటారు. సినిమా తర్వాత ఎవరి దారి వారిదనే విధంగా ఉంటారు.

కానీ కొంతమంది నటీనటులు మాత్రం అలా కాదు. ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో కనిపించినా ఏదైనా ఈవెంట్ లో కనిపించినా కూడా క్లోజ్ గా ఉండటమే కాకుండా హగ్ లు, కిస్ లు కూడా ఇచ్చుకుంటారు. దీంతో వారు బాగా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు. అయితే కొందరు హీరోలు మాత్రం అలా ఉండరు. ముఖ్యంగా మన తెలుగు హీరోలను గమనిస్తే.. అందులో వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చరణ్ మరికొందరు హీరోలు కేవలం సినిమాల షూటింగ్ వరకు మాత్రమే హీరోయిన్ లతో క్లోజ్ గా మూవ్ అవుతారు.

ఆ తర్వాత వీళ్ళు వారి దారి వారు చూసుకుంటారు. ఈ స్టార్ హీరోలు కుటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఏ హీరోయిన్లు కనిపించినా కూడా కనీసం వాళ్ళని ముట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. చాలావరకు గ్యాప్ పాటిస్తూ ఉంటారు. పైన చెప్పుకున్న హీరోల‌లో చాలా మంది తెర‌మీద హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసేందుకే బాగా సిగ్గుప‌డుతూ ఉంటారు. వీరు సినిమాల్లో హీరోయిన్ల‌తో న‌టించేందుకే ఇబ్బంది ప‌డితే ఇక రియ‌ల్‌గా మాత్రం క్లోజ్‌గా మూవ్ అయ్యేందుకు ఎందుకు ? ఇష్ట‌ప‌డ‌తారు.

మరి కొందరు హీరోలను మాత్రం గమనించినట్లయితే వీళ్లు హీరోయిన్లతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ రొమాంటిక్ హీరోలుగా పేరును సంపాదించుకున్నారు. కొందరు హీరోలు ఇతర హీరోయిన్లతో కలిసి విదేశాలకు వెళుతూ క్లోజ్ గా కనిపిస్తూ ఉంటాడు. కానీ మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు మాత్రం అలా కనిపించరు. ఎవరితో కూడా అలా ప్రవర్తించరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news