Moviesకమెడియన్ రాహుల్ రామకృష్ణ నోటి దూల..గాంధీజీ పై వల్గర్ కామెంట్స్..వైరల్..!?

కమెడియన్ రాహుల్ రామకృష్ణ నోటి దూల..గాంధీజీ పై వల్గర్ కామెంట్స్..వైరల్..!?

మనిషికి నోరు ఉంది కదా అని అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది . ప్రజెంట్ అలాంటి పొజిషన్ ని ఎదుర్కొంటున్నాడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ.ఈయనకి నోటి దూల అనే సంగతి తెలుసు కానీ.. మరి ఇంత నోటి దూల అని జనాలు ఊహించలేకపోయారు. లేకపోతే ఏకంగా జాతిపిత మహాత్మా గాంధీజీ పై అలాంటి కామెంట్స్ చేస్తాడా..? ఎంత ధైర్యం ఇదే కామెంట్స్ తో ఇప్పుడు జనాలు ఆయనపై ఫుల్ ఫైర్ అయిపోతున్నారు.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో కామెడీ సినిమాలు చేస్తూ అద్భుతమైన నటనను పండించిన రాహుల్ రామకృష్ణ సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ కమెడియన్ స్టేటస్ సంపాదించుకున్నాడు. సైన్మ అనే ఒక షార్ట్ ఫిలిం తో వెలుగులోకి వచ్చిన రాహుల్ ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఆయనకు తిరిగి తిరుగులేని బ్రేక్ ఇచ్చింది. తనదైన స్టైల్ లో , యాసలో మాట్లాడుతూ అర్జున్ రెడ్డిని మించిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు రాహుల్ రామకృష్ణ.

ఈయన సినిమాలు చూసిన జనాలు ఆయనకు సినిమాలో మాత్రమే నోటిదల ఉంది అనుకునేవారు . కానీ కాదు నిజ జీవితంలో కూడా ఈ దూల కంటిన్యూ అవుతుంది అని జనాలకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది . గతంలో సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నానని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టి ఆ తర్వాత అంత తూచ్ అంటూ లగ్జరీ లైఫ్ ను నేను ఎందుకు వదులుకుంటాను అంటూ మరోట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చాడు. ఇలా తిక్క తిక్క పనులు చేయడంలో రాహుల్ రామకృష్ణ నెంబర్ వన్ అంటూ ఆనాడే ఫిక్స్ అయిపోయారు జనాలు .

ఈ క్రమంలో నే అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా జాతిపితను కించపరిచేలా రాహుల్ రామకృష్ణ చేసిన ట్విట్ వైరల్ గా మారింది . ” గాంధీజీ గొప్ప వారు అని నేను అనుకోవడం లేదు” అని కామెంట్ పెట్టి పోస్ట్ చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ కామెంట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఈ కామెంట్ తో ఆయనను విమర్శించే జనాలు ఎక్కువగా కనిపిస్తున్నారు. బండ బూతులు తిడుతూ రేంజ్ లో రెచ్చిపోయారు. దీంతో రాహుల్ రామకృష్ణను బాయ్ కాట్ చేయాలని ఫిలిం ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news