Moviesనైట్ నుండి పండగ చేసుకుంటున్నాం.. పవిత్ర పై చెయ్యి వేసి మరి...

నైట్ నుండి పండగ చేసుకుంటున్నాం.. పవిత్ర పై చెయ్యి వేసి మరి ఎంజాయ్ చేస్తున్న నరేష్..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పవిత్ర లోకేష్, సీనియర్ నటుడు నరేష్ పేర్లు ఎలా మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు .ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ఇద్దరికి డైవర్స్ ఇచ్చి మూడో భార్యకి డ్రైవర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతే కాదు త్వరలోనే పవిత్ర లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో పవిత్ర లోకేష్ భుజాలపై చేయి వేస్తూ ఆమెను తాకుతూ సెన్సేషనల్ వీడియోని రిలీజ్ చేశారు .

దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ షాక్ అయిపోయింది . రీసెంట్గా కమెడియన్ అలీ హీరోగా నటించిన చిత్రం “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి” ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. డైరెక్ట్ గా ఓటీపీ లోనే స్టీమింగ్ అయింది . అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా హ్యూజ్ పాజిటివ్ రివ్యూస్ అందుకొని టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే నరేష్-పవిత్ర లోకేష్ మీడియా ముందుకు వచ్చి సినిమా సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ చెబుతూ జనాలకి కృతజ్ఞతలు తెలియజేశారు .

ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర లోకేష్ పై చేయి వేసి ఆమెను తాకుతూ మాట్లాడుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో నరేష్ మాట్లాడుతూ ..”కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా జనాలు ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ చేశారని.. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమా ఇలాంటి పాజిటివ్ రివ్యూస్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని.. నైట్ నుంచి నేను అన్ని రివ్యూస్ చదువుతున్నానని ..వందలాది మెసేజ్లు వస్తున్నాయని ..సినిమా బాగుంది అంటున్నారని ..దీంతో నైట్ నుంచి మేము పండగ చేసుకుంటున్నామని చెప్పుకొచ్చాడు.

ఈ వీడియో రన్ అవుతున్నంతసేపు నరేష్ ఆమె భుజాలపై చేయి మాత్రం తీయ్యలేదు.. గట్టిగా పట్టుకొని ఆమెను తాకుతూనే మాట్లాడుతున్నాడు . దీంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో కొందరు ముసలోడికి దసరా పండుగ అని… ముసలోడు అయినా మహానుభావుడు అంటూ నరేష్ పై వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా సరే పవిత్ర లోకేష్ నరేష్ అలాంటి కామెంట్స్ లో పట్టించుకోకుండా లైఫ్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news